భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విద్యుత్ వాహన స్టార్టప్- ఇట్రియో, ఇంట్రాసిటీ లాజిస్టిక్స్‌ను విద్యుదీకరించాలనే లక్ష్యంతో తమ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను నూతన విద్యుత్ త్రిచక్ర వాహన శ్రేణి ఉత్పత్తులను తమ బ్రాండ్ టౌరో పేరిట ఆవిష్కరించడం ద్వారా విస్తరించింది. కార్గో విభాగాపు అవసరాలను తీరుస్తూ ఈ రెండు నూతన వేరియంట్లు, ఇప్పుడు అధికంగా ఇంట్రాసిటీ లాజిస్టిక్స్‌పై దృష్టి కేంద్రీకరించాయి. మరీ ముఖ్యంగా చివరి మైలు డెలివరీ అప్లికేషన్‌ల కోసం ఇది దృష్టి కేంద్రీకరించింది. త్రిచక్ర వాహనాల ప్యాసెంజర్ వేరియంట్స్ త్వరలోనే మార్కెట్‌లోకి రానున్నాయి. ఈ ఆవిష్కరణలను సాధ్యం చేయడానికి ఈ కంపెనీ గత నెలలో మూడు మిలియన్ డాలర్లను సమీకరించింది.
పోర్చుగ్రీస్ పదం టోరో నుంచి టౌరో ఉద్భవించింది. దీని అర్ధం ఎద్దు అని! ఈ కారణం చేతనే ఈ వాహన డిజైన్ సిద్ధాంతం ఎద్దులాగానే శక్తివంతమైన స్థిరత్వం, సాటిలేని శక్తి, అసాధారణ బరువులను తీసుకువెళ్లే సామర్థ్యం, తీవ్రమైన ఏకాగ్రతను ప్రదర్శిస్తుంది. టౌరో వాహనాలు, ఎద్దు స్ఫూర్తితో సిగ్నేచర్ ఫ్రంట్ గ్రిల్‌తో వస్తాయి మరియు ఇట్రియో యొక్క తయారీ బ్రేక్ డ్రమ్‌లతో వస్తాయి. ఈ కంపెనీ పూర్తిగా తమ టౌరో ఫ్యామిలీ వాహనాలను స్వదేశీయంగా తయారుచేయడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాయితీలను పొందేందుకు అర్హత సాధిస్తుంది.
ఈ ప్రకటనపై దీపక్ ఎంవీ, కో-ఫౌండర్ అండ్ సీఈవో, ఇట్రియో మాట్లాడుతూ, ‘‘టౌరో ఆవిష్కరణతో మేము మా రెట్రోఫిట్టెడ్ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోకు నూతన విద్యుత్ వాహనాలను జోడించాం. ఇంట్రా సిటీ లాజిస్టిక్స్‌కు విద్యుతీకరించాలనే లక్ష్యంతో మేము ముందుకు వెళ్తున్నాం. ఈ విభాగం కోసం ప్రత్యేకమైన విద్యుత్ వాహనాలను తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాం. టౌరోతో, వినియోగదారులు ద్వంద్వ ప్రయోజనాలను పొందగలరు. నిర్వహణ ఖర్చు దాదాపు 70% పొదుపు చేయడంతో పాటుగా ఈ గేర్ రహిత, పొగ రహిత, శబ్ద రహిత వాహన సవారీ ద్వారా అసాఽధారణ సౌకర్యమూ పొందవచ్చు. శ్రేణి మరియు వాల్యూమిట్రిక్ సామర్ధ్య పరంగా అత్యున్నత పనితీరు అందించే ఉత్పత్తిని నిర్మించాము. ఇది అత్యుత్తమ భద్రత మరియు స్థిరత్వ ఫీచర్లను కలిగి ఉంటుంది.
బ్యాటరీలు మరియు పవర్ ట్రైన్‌పై ప్రపంచ శ్రేణి వారెంటీలను మేము అందిస్తున్నాం. ఇది క్లిష్టత లేని యాజమాన్య అనుభవాలను అందిస్తుంది. సాంకేతిక కోణంలో చూసినప్పుడు, మేము ఈ విభాగంలో అత్యుత్తమ శ్రేణి ఫీచర్లను తీసుకువచ్చాం. వాటిలో రీజనరేటివ్ బ్రేకింగ్‌తో హైడ్రాలిక్ బ్రేక్స్, స్వతంత్య్ర సస్పెన్షన్, డ్రైవర్ మొబైల్ యాప్‌తో క్లౌడ్ ఆధారిత వాహన ట్రాకింగ్ యంత్రసామాగ్రి వంటివి ఉన్నాయి. అత్యాధునిక లిథయం అయాన్ బ్యాటరీ సాంకేతికతతో వాహనాలను తయారుచేయడంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాం. ఇట్రియోలో ధృవీకృత ఉత్పత్తి శ్రేణి లెడ్-యాసిడ్‌తో ఉండి విస్తృత శ్రేణి వినియోగదారుల అవసరాలను తీరుస్తాయి.
తమ టౌరో ద్వారా అత్యంత ప్రాచుర్యం పొందగలమని ఇట్రియో ఆశిస్తుంది. ఇ-కామర్స్ కంపెనీలు తప్పనిసరిగా విద్యుతీకరణను ప్రోత్సహిస్తుండటం, డీజిల్ వాహనాలతో పోలిస్తే టౌరో యొక్క కాంపిటీటివ్ టోటల్ కాస్ట్ ఓనర్‌షిప్ (టీసీఓ) వంటివి దీనికి కారణాలుగా నిలుస్తాయని భావిస్తుంది. విద్యుత్ త్రి చక్రవాహనాలు ఇప్పుడు డ్రైవర్ల కోసం నూతన ప్రాంగణాలుగా నిలువడంతో పాటుగా టౌరో యొక్క విజయం కోసం డ్రైవర్ భాగస్వాములు కొనుగోలు చేయడం తప్పనిసరి. ఇట్రియో యొక్క సమగ్రమైన డ్రైవర్ శిక్షణ మరియు సర్టిఫికేషన్ కార్యక్రమాలలో అవసరమైన ఓరియెంటేషన్ మరియు హ్యాండ్‌హోల్డింగ్‌తో ఇట్రియోను రోడ్డు మీదకు తీసుకురావడం పట్ల మేము గర్వంగా ఉన్నాము’’ అని అన్నారు.
ఈ వాహనంలోని సాంకేతిక వైభవం కారణంగా లాజిస్టిక్స్ మరియు ఇ-కామర్స్ ఆపరేటర్లు తమ వాహన వినియోగాన్ని పూర్తిగా పర్యవేక్షించడం మరియు వాస్తవ సమయంలో దాని స్ధితి తెలుసుకోవడం మరియు దాని ప్రస్తుత చార్జింగ్ స్థితి కూడా తెలుసుకోవడం కూడా సాధ్యమవుతుంది. టౌరో యొక్క నివారణ నిర్వహణ కారణంగా ఫ్లీట్ ఆపరేటర్లు తమ ఫ్లీట్‌ను సరైన రీతిలో ఉంచుకోవడంతో పాటుగా ఇంధనం దొంగిలించబడిందనే బాధ నుంచి ఉపశమనం పొందుతారు. అదే సమయంలో, మానవ సంబంధిత తప్పిదాలు అయినటువంటి వాహనాలను సరిగా వినియోగించకపోవడం లేదా ర్యాష్ డ్రైవింగ్ వంటివాటిని సైతం సులభంగా కనుగొనవచ్చు. దానితో పాటుగా తగిన చర్యలనూ తీసుకోవచ్చు. ఇట్రియో యొక్క టౌరోపై వాహన ఆపరేటర్లు పూర్తి నియంత్రణ కలిగి ఉంటారు.
ఇట్రియో ఇప్పుడు బీ2బీ వినియోగదారులు అయినటువంటి లెట్స్ ట్రాన్స్‌పోర్ట్, అమెజాన్, బిగ్‌బాస్కెట్, ఐకియా మొదలైన వాటితో కలిసి పనిచేస్తుంది. తద్వారా వారి నిర్వహణ అవసరాలకు తగినట్లుగా వాహనాలను రూపొందించి అందిస్తుంది. ఈ ఉత్పత్తులకు స్థిరమైన ధరఅంటూ ఏమీ లేదు. బ్యాటరీ కెమిస్ట్రీ, పేలోడ్ అవసరాలు, క్యూబిక్ సామర్థ్యం, ప్రతి రోజూ తిరిగే కిలోమీటర్లు వంటి అంశాలపై ఈ ధరలు నిర్ణయమవుతాయి.
టౌరో మ్యాక్స్ మరియు మినీ వాహనాలు అమ్మకాలు మరియు లీజు అవకాశాలలో లభ్యమవుతాయి. ఈ కంపెనీ ఇప్పుడు లీజుపై కూడా సుప్రసిద్ధ సంస్థలకు వాహనాలను 50 యూనిట్లు మరియు అంతకు మించిన వాహనాలను మూడేళ్ల కాలానికి లీజుకు తీసుకున్న ఎడల అందిస్తుంది. ఈ కంపెనీకి నెలకు 500 యూనిట్లను తయారుచేసే సామర్థ్యం ఉంది. అమ్మకాలు మరియులీజింగ్ నమూనా ద్వారా దేశవ్యాప్తంగా వేగంగా విస్తరించేందుకు ఇప్పుడు టౌరో ప్రయత్నిస్తుంది.
ప్రస్తుతం, హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో సుప్రసిద్ధ ఇ- కామర్స్ లాజిస్టిక్స్ వద్ద టౌరో పైలెట్ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ కంపెనీ ఇప్పుడు దేశవ్యాప్తంగా తమ పాదముద్రికలను రాబోయే కొద్ది నెలల్లో విస్తరించడానికి ప్రణాళిక చేసింది. నూతన ఎలక్ట్రిక్ త్రి చక్ర వాహనాలలోని నూతన వేరియంట్లును రాబోయే కొద్ది నెలల్లో ఆవిష్కరించనున్నారు. దీనితో పాటుగా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాలలో తమ డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను కంపెనీ ఏర్పాటుచేయనుంది.
బ్యాటరీ ధరలు గణణీయంగా తగ్గడంతో పాటుగా తెలంగాణా, ఢిల్లీ వంటి రాష్ట్రాలలో ఆకర్షణీయమైన ఈవీ విధానాలు వంటివి, దేశవ్యాప్తంగా గ్రీన్ మొబిలిటీ వైపు వేగంగా పయణించేందుకు తోడ్పడుతున్నాయి. ఇది దృష్టిలో పెట్టుకుని మరియు క్రిసిల్‌చేసిన తాజా అధ్యయనంతో 2024 నాటికి 50% నూతన త్రి చక్ర వాహనాలు విద్యుతీకరించబడనున్నాయి. ఇట్రియో ఇప్పుడు మరింతగా సర్క్యులర్ ఎకనమీని తమ విప్లవాత్మక ఉత్పత్తులు అయినటువంటి టౌరో ద్వారా ప్రోత్సహించడానికి కట్టుబడి ఉంది.
టౌరో మినీ ప్రమాణాలు:
లిథియం అయాన్ 4కిలోవాట్‌హవర్ బ్యాటరీ
2.5 కిలోవాట్ పీక్ పవర్ మోటార్
400కేజీల గరిష్ట పేలోడ్
గంటకు 25కిలోమీటర్ల గరిష్ట వేగం
టౌరో మ్యాక్స్ ప్రమాణాలు:
లిథియం అయాన్ 8కిలోవాట్‌హవర్ బ్యాటరీ
8 కిలోవాట్ పీక్ పవర్ మోటార్
550 కేజీల గరిష్ట పేలోడ్
గంటకు 45 కిలోమీటర్ల గరిష్ట వేగం
ఇతర ఫీచర్లలో...
అలసట లేని బ్రేకింగ్ కోసం హైడ్రాలిక్ బ్రేక్స్
రెండు డ్రైవింగ్ మోడ్స్- ఎకో మరియు బూస్ట్
అత్యధిక స్థిరత్వం కోసం లో సెంటర్ ఆఫ్‌గ్రావిటీ
రీజనరేటివ్ బ్రేకింగ్
మోటార్, కంట్రోలర్, బ్యాటరీపై మూడు సంవత్సరాల వారెంటీ
డ్రైవర్ మొబైల్ ఇంటరాక్టివ్ యాప్‌తో క్లౌడ్ ఆధారిత వాహన ట్రాకింగ్
పూర్తి డిజిటల్ క్లస్టర్
డ్యూయల్ హెడ్‌ల్యాంప్
కీలకమైన విద్యుత్ విడిభాగాల కోసం అత్యుత్తమ శ్రేణి డస్ట్ మరియు వాటర్ ప్రొటెక్షన్.