శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. రత్నాల శాస్త్రం
Written By Selvi
Last Updated : గురువారం, 25 జూన్ 2015 (16:27 IST)

సీతాదేవి ఆ ఉంగరంలోనే సాక్షాత్తు తన భర్తను దర్శించిందట..

చూపుడు వేలికి తొడుక్కున ఉంగరం ధైర్యాన్ని తెలియజేస్తుంది. మధ్యవేలుకున్న ఉంగరం హుందాతనాన్ని, గౌరవాన్ని, అనామికను ఉన్నట్లైతే ప్రేమను, చిటికెన వేలుకు ఉంటే అది వశీకరణ కలిగిస్తాయని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. 
 
మన జీవితంలో ఉంగరానికి ఉన్న ప్రాధాన్యత అపారం. బారసాల, అన్నప్రాసన, పెళ్లి.. ఇలా అనేక ఘట్టాల్లో ఉంగరం తప్పనిసరిగా మారిపోయింది. రాముడు-సీత, దుష్యంతుడు-శకుంతల ఇలా ఎందరినో కలిపింది. 
 
''వానరోహం మహాభాగే! దూతో రామస్య ధీమతః
రామ నామాంకితం చేడంపశ్య దేవ్యంగుళీయకమ్''
 
అమ్మా! నేను వానరుడును, రామదూతను. ఇదిగో రామనామాంకితమైన అంగుళీయకం. నీకు నమ్మకం కుదరడం కోసం శ్రీరాముడు పంపించారు. దీనిని అందుకో ! నీకు దుఃఖోపశాంతి కలుగుతుంది.- హనుమంతుడు ఇచ్చిన ఉంగరాన్ని అందుకోగానే సీతాదేవికి తన భర్తను సాక్షాత్తు ఆ ఉంగరంలోనే చూస్తున్నట్లు ఆమె వందనం చంద్రబింబంలా ప్రకాశించింది.