1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 18 ఆగస్టు 2014 (16:25 IST)

యాపిల్, సోయాబీన్స్‌తో పొట్టను తగ్గించండి!

పొట్ట తగ్గించాలనుకుంటున్నారా? ఇందుకోసం రకరకాలైన వ్యాయామాలు చేస్తున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి. పొట్ట తగ్గాలంటే రోజుకు 30 నిమిషాల పాటు నడక సాగించాలి. దీంతో పాటు పండ్లను ఎక్కువగా తీసుకోండి. 
 
రాత్రి ఆహారం తీసుకుని నిద్రపోవడానికి ముందు పండ్లు తీసుకోవడం ద్వారా పొట్టను తగ్గించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. డిన్నర్ అయ్యాక పీచ్ ఫ్రూట్స్ లేదా ఓ ఆపిల్ పండును తీసుకుంటే పొట్ట తగ్గడంతో పాటు శరీరానికి కావలసిన ఎనర్జీని ఇస్తుంది. 
 
ఇకపోతే.. పొట్ట పెరగడానికి సోడియం, పొటాషియమే కారణమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుచేత ఫైబర్ అధికంగా ఉండే బీన్స్, సోయాబీన్స్‌ను ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.