బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 మే 2024 (14:22 IST)

బెంగుళూరు రేవ్ పార్టీ : తీగలాగుతుంటే డొంక కదులుతుంది...

rave party
బెంగుళూరు నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీలో జరిగిన రేవ్ పార్టీకి సంబంధించి అనేక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తీగ లాగితుంటే డొంక కదులుతున్నట్టుగా ఇవి వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును బెంగుళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ విభాగంగా లోతుగా దర్యాప్తు చేస్తింది. రేవ్ పార్టీ నిర్వహణకు సంబంధించి ప్రధాన నిందితుడు వాసుతో పాటు మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిలో ఏపీకి చెందిన వైకాపా మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి, రెడ్డి, అన్నమయ్య జిల్లా రాయచోటి వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిల అనుచరులు కొందరు ఉన్న విషయం తెలిసిందే. 
 
ఆ పార్టీలో మంత్రి కాకాణి పేరు ఉన్న కారు స్టిక్కర్‌ను సీసీబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాని ఆధారంగా హైదరాబాద్‌ నగరానికి చెందిన పూర్ణారెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. రేవ్ పార్టీలో ఏర్పాటులో ఆయన ప్రముఖ పాత్ర పోషించారని, ఆయన మంత్రి అనుచరుడేనని పోలీసులు ధ్రువీకరించారు. ఇప్పటికే అరెస్టు అయిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అనుచరుడు అరుణ్ కుమార్ సెల్ఫోన్ ఆధారంగా దర్యాప్తు సాగిస్తున్నామని వెల్లడించారు. 
 
ఈ పార్టీలో పాల్గొన్న తెలుగు సినీ నటి హేమ సహా మొత్తం ఎనిమిది మందికి సీసీబీ పోలీసులు శనివారం నోటీసులు జారీచేశారు. ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. మొత్తం 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో బయటపడగా.. అందులో 59 మంది పురుషులు, 27 మంది యువతులు ఉన్నారు.