మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By
Last Updated : గురువారం, 28 ఫిబ్రవరి 2019 (14:03 IST)

ఉబ్బస వ్యాధి ఎందుకు వస్తుంది..?

ఉబ్బసంతో బాధపడేవారు వీలైనన్ని తక్కువ క్యాలరీలను తీసుకోవడం ద్వారా వ్యాధి లక్షణాల నుండి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా శరీరానికి అందే క్యాలరీలు కొవ్వుల నుండి వచ్చినా.. చక్కెరల నుండి వచ్చిన ఈ ఫలితాల్లో తేడాలేవీ ఉండవని వారు చెప్తున్నారు.
 
అధిక ఆహారం తీసుకోవడం కారణంగా ఊబకాయానికి గురై ఊపిరితిత్తులు మంట, వాపులకు గురవుతాయని.. దాని ఫలితంగా ఉబ్బస లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మంట, వాపు నివారణకు మందులు వేసుకుంటే పరిస్థితి సాధారణమవుతుందని ఇటీవలే ఓ పరిశోధనలో వెల్లడించారు.
 
నలుగురు మందికి నాలుగు రకాల ఆహారాన్ని అందించి వారిపై పరిశీలనలు జరిపాం. ఎనిమిది వారాల తరువాత తక్కువ క్యాలరీలు తీసుకున్న వారికి ఊపిరితిత్తుల పనితీరు మెరుగ్గా ఉన్నట్లు తెలిసింది. అదే కొవ్వు ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకున్న వారికి ఊపిరితిత్తుల్లోని వాయుమార్గాలు సాధారణం కంటే చాలా రెట్లు కుంచించుకుపోయినట్లు తెలిసిందని అధ్యయనంలో స్పష్టం చేశారు.
 
దీన్ని బట్టి మితాహారానికి ఉబ్బస లక్షణాలకు మధ్య సంబంధం ఉన్నట్లు తాము అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఉబ్బసం వ్యాధికి మరింత మెరుగైన చికిత్స కల్పించేందుకు పరిశోధన ఉపయోగపడుతుందని అన్నారు.