శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By
Last Updated : బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (17:43 IST)

టాటూలు వేసుకుంటున్నారా.. జాగ్రత్త..?

టాటూలు వేయించుకోవడం మంచిది కాదంటున్నారు. టాటూలు గోళ్లపై కూడా దర్శనమిస్తున్నాయి. ఈ టటూలు వేసుకునే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గమనించాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా టాటూలకు ఉపయోగించే ఇంకుల్లోని రసాయనాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే...
 
టటూల ద్వారా సూక్ష్మమైన పదార్థాలు శరీరంలో చేరే అవకాశం ఉంది. టాటూ ఇంకుల్లోని రసాయనాల వలన శరీర రోగనిరోధకశక్తి దెబ్బతింటుంది. ఈ టాటూల రంగుల్లో సేంద్రియ పదార్థాలతో పాటు సేంద్రియేతర పదార్థాలు కూడా ఉంటాయి. విష్యతుల్యమైన వ్యర్థాలు ఉంటాయి. అందుకే టటూలు వేయించుకునేటప్పుడు వాటికి ఉపయోగించే ఇంకుల్లోని రసాయనాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి.
 
ఈ ఇంకుల్లో కార్బన్ బ్లాక్‌తో పాటు టైటానియం డయాక్సైడ్ కూడా ఉంటుంది. వీటి వలన చర్మంపై దురద, ఇరిటేషన్‌లు తలెత్తుతాయి. టాటూలకు ఉపయోగించే నీడిల్స్‌ను ఎప్పటికప్పుడు స్టెరిలైజ్ చేయాలి. టాటూ రంగుల్లోని రసాయనాల ప్రభావం గురించి అవగాహనా లేమి చాలా ఉంది. టటూలు వేయించుకున్న ప్రదేశంలో మాలిక్యులర్ స్థాయిలో రక్తనాళాల్లో వచ్చే మార్పులను గుర్తించవచ్చును.