శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 26 ఆగస్టు 2022 (22:53 IST)

పార్కిన్సన్స్ వ్యాధి ప్రారంభ సంకేతాలు ఏమిటి?

Parkinson
పార్కిన్సన్స్ వ్యాధి అనేది నాడీ సంబంధిత రుగ్మత. ఈ వ్యాధి కొన్ని ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయో తెలుసుకుందాం.
 
హ్యాండ్ రైటింగ్ లో అకస్మాత్తుగా మార్పులు, రాసేటపుడు చిన్నచిన్న ఇరుకైన అక్షరాలుగా మారడం.
వణుకు, ముఖ్యంగా వేలు, చేయి లేదా పాదాలలో కనబడుతుంది.
నిద్రలో అనియంత్రిత కదలికలు.
అవయవాల దృఢత్వం లేదా నెమ్మదిగా కదలిక.
స్వరంలో మార్పులు.
దృఢమైన ముఖ కవళికలు లేదా మాస్కింగ్.
వంగిపోయినట్లుగా వుండే భంగిమ.
 
పార్కిన్సన్స్ కదలికను నియంత్రించే న్యూరాన్లు అని పిలువబడే మెదడు కణాలతో మొదలవుతుంది. న్యూరాన్లు డోపమైన్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. న్యూరాన్లు చనిపోయినప్పుడు, మెదడులోని డోపమైన్ స్థాయిలు తగ్గినప్పుడు పార్కిన్సన్స్ మొదలవుతుంది. డోపమైన్ లేకపోవడంతో మనిషి కదిలే విధానాన్ని ప్రభావితం చేసే లక్షణాలకు దారితీస్తుందని భావిస్తారు. పైన చెప్పుకున్న లక్షణాలు అప్పుడప్పుడు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి.