సోమవారం, 3 ఫిబ్రవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 22 మే 2018 (11:28 IST)

బొప్పాయి పండును తింటే ఆ వ్యాధి తగ్గుతుంది

బొప్పాయి పండులో ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియంతోపాటు ఇతర ఖనిజలవణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో విటమిన్ ఎ, బి, సి, డి ఎక్కువగా లభిస్తాయి. దీనిని ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. తరచుగా దీనిని ఆ

బొప్పాయి పండులో ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియంతోపాటు ఇతర ఖనిజలవణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో విటమిన్ ఎ, బి, సి, డి ఎక్కువగా లభిస్తాయి. దీనిని ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. తరచుగా దీనిని ఆహారంగా తీసుకోవడం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఉదర సంబంధమైన జబ్బులను మటుమాయం చేసేందుకు బొప్పాయి పండు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 
 
శరీరంలోని పలు జబ్బులకు ప్రధాన కారణం ఉదరమే కనుక బొప్పాయి పండును ఆహారంగా తీసుకుంటే మంచిది. ఇందులోని విటమిన్ ఎ శరీర చర్మానికి, కళ్ళకు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. కంటి వ్యాధులను దూరం చేసెందుకు ఉపయోగపడుతుంది. ఇది రక్తనాళికలను శుభ్రం చేయడంతో పాటు గుండె, నరాలు, కండరాల పనితీరును మరింత చురుగ్గా తయారుచేయుటకు సహాయపడుతుంది.  
 
బొప్పాయిలో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులో ఉండే పొటాషియం గుండె జబ్బులకు, విటమిన్ కె ఎముకలను గట్టి పరుస్తుంది. ఊబకాయాన్ని తగ్గిస్తుంది. పండిన బొప్పాయి గ్రీన్ టీలో కలుపుకుని తీసుకుంటే షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. మానసిక ఆందోళనను దూరంచేయుటకు ఉపయోగపడుతుంది.
 
బొప్పాయి పండు తినడం వలన ఆస్తమా వ్యాధికి నివారించుటకు సహాయపడుతుంది. డెంగు వ్యాధి నివారణకు బొప్పాయి ఆకుల రసాన్నీ తీసుకుంటే చాలా మంచిది. తెగిన, కాలిన గాయాలపై బొప్పాయి గుజ్జును పెట్టుకున్నట్లైతే గాయాలు త్వరగా మానుతాయి. గర్భిణీ స్త్రీ ఎట్టి పరిస్థితులలోనూ బొప్పాయా పండును తినరాదు.