బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : బుధవారం, 21 సెప్టెంబరు 2016 (15:31 IST)

గాలి కాలుష్యంతో మెదడుకు దెబ్బే.. జ్ఞాపకశక్తి గోవిందో గోవిందా..

ఆధునిక జీవన యుగంలో జనాభా పెరుగుతున్న కొద్దీ కాలుష్యం కూడా భారీగా పెరిగిపోతుంది. గాలితో పాటు నీరు కలుషితం కావడంతో పాటు భూమిసైతం వేడెక్కిపోతంది. ముఖ్యంగా నగరాల్లో కాలుష్య ప్రభావం అంతా ఇంతా కాదు. అందుకే

ఆధునిక జీవన యుగంలో జనాభా పెరుగుతున్న కొద్దీ కాలుష్యం కూడా భారీగా పెరిగిపోతుంది. గాలితో పాటు నీరు కలుషితం కావడంతో పాటు భూమిసైతం వేడెక్కిపోతంది. ముఖ్యంగా నగరాల్లో కాలుష్య ప్రభావం అంతా ఇంతా కాదు. అందుకే నగర వాసులు గాలి కాలుష్యంతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
గాలి కాలుష్యంతో మెదడుకు దెబ్బేనని తాజాగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా గాలి కాలుష్యంతో మెదడుకు సంబంధిత వ్యాధులు, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఎలుకలపై నిర్వహించిన టెస్టుల్లో కలుషితమైన గాలిని పీల్చడంలో శారీరకంగా కొన్ని మార్పులు చోటు చేసుకోవడంతో పాటు, మెదడు సంబంధించి నెగటివ్ ఫలితాలు వచ్చాయని ఓహియో స్టేట్ యూనివర్శిటీ స్టడీలో తేలింది. 
 
గాలి కాలుష్యంతో గుండె, ఊపిరితిత్తులకు ప్రమాదమని ఇంతకుముందు నిర్వహించిన సర్వేలో తేలగా, మొట్టమొదటి సారిగా గాలి కాలుష్యంతో మెదడుకు సంబంధిత వ్యాధులు సోకుతాయని తేలిందని ఓహియో స్టేట్ యూనివర్శిటీ స్టూడెంట్ లారా ఫాకెన్ తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో అధిక సంఖ్యలో బసచేసే వారికే గాలి కాలుష్యంతో ప్రమాదం ఎక్కువని ఫాకెన్ చెప్పారు.