గురువారం, 5 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 30 ఏప్రియల్ 2017 (10:22 IST)

బరువు తగ్గాలనుకునేవారు.. మొలకలు తినండి..

బరువు తగ్గాలనుకునేవారు మొలకలు తినండి. మొలకలను దినడం ద్వారా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. మొలకల్లో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థాలు పూర్తిగా తొలగిపోత

బరువు తగ్గాలనుకునేవారు మొలకలు తినండి. మొలకలను దినడం ద్వారా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. మొలకల్లో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థాలు పూర్తిగా తొలగిపోతాయి. జుట్టు కూడా బాగా పెరుగుతుంది. అన్ని వయసుల వారూ వీటిని తీసుకోవచ్చు. మదడుకు రక్తం చక్కగా సరఫరా చేయడంలో మొలకలు భేష్‌గా పనిచేస్తాయి. 
 
మొలకల్లో జింక్‌, ఇనుము, క్యాల్షియం ఎక్కువగా లభిస్తాయి. ఇవన్నీ శరీరంలోని అన్ని అవయవాలకు సక్రమంగా ప్రాణవాయువును సరఫరా చేస్తాయి. వీటిలోని  జింక్‌ సంతాన లోపాన్ని దూరం చేస్తుంది. విద్యార్థులు మొలకలను తినడం ద్వారా మెదడు పనితీరు చురుగ్గా సాగుతుంది. ఒత్తిడి దూరమవుతుంది. ఒక వయసుకొచ్చాక చాలామంది మహిళలు హార్మోన్ల అసమతుల్యతకు లోనవుతారు. దీనివల్ల చాలా రకాల సమస్యలు ఎదురవుతాయి. అలాంటివారు తప్పనిసరిగా రోజూ మొలకలను తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.