Biodata Maker
✕

ఆప్రికాట్‌తో ఆరోగ్యం.. మధుమేహానికి దివ్యౌషధం.. ఒత్తిడి పరార్

Written By సెల్వి
Updated: శుక్రవారం, 18 నవంబరు 2022 (16:13 IST)
ఆప్రికాట్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంత మేలు చేకూరుతుంది. ఆప్రికాట్ మంచి జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్ చాలా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను దూరం చేయడంలో మేలు చేస్తుంది.
 
కళ్ల కాంతిని పెంచేందుకు బీటా కెరోటిన్ అనే మూలకం ఇందులో పుష్కలంగా లభిస్తుంది. ఇది ఫినోలిక్ అని పిలువబడే ఫైటోకెమికల్స్ కలిగి ఉన్నందున ఇది గుండె జబ్బులను దరిచేరనివ్వదు. 
 
ఫోలేట్, ఐరన్ పుష్కలంగా ఉన్నందున ఇది రక్తహీనత చికిత్సలో సహాయపడుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించే క్లోరోజెనిక్ ఆమ్లం ఉన్నందున ఇది మధుమేహానికి ఎంతో మేలు చేస్తుంది. 
 
ఇందులో అనాల్జేసిక్ గుణం వుండటం వల్ల చెవి నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. ఇందులోని పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలను కలిగి ఉన్నందున రక్తపోటును నియంత్రిస్తుంది.
 
ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా కాలేయాన్ని రక్షిస్తాయి. ఇది హెపాటోప్రొటెక్టివ్ లక్షణాలను కలిగి ఉంది, ఇది కాలేయం దెబ్బతినకుండా కాపాడుతుంది.
 
పొటాషియం, ఫైబర్, బీటా కెరోటిన్, ప్రొటీన్, కాల్షియం, ఐరన్, విటమిన్ కె, ఎ, ఫోలిక్ యాసిడ్ ఉన్నాయి. ఇది ఎముకలకు మేలు చేస్తుంది. క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

అన్నీ చూడండి

వైజాగ్ స్టీల్ సిటీ కాస్త సిలికాన్ సిటీగా మారుతోంది : కేంద్ర మంత్రి పియూష్ గోయల్

సీఎం చంద్రబాబును ఓ కోరిక కోరిన సుచిత్ర ఎల్ల ... వెను వెంటనే....

గోదావరీ పరివాహక ప్రాంతంలో పెద్దపులి సంచారం.. ట్రాకర్ అమర్చినా..?

గోడకు కన్నం వేసి.. రూ.12కోట్ల విలువైన బంగారం ఎత్తుకెళ్లారు.. ఎక్కడ?

కార్గో కంటైనర్ అడుగుభాగంలో రూ.4కోట్ల విలువైన ఇ-సిగరెట్లు స్వాధీనం

అన్నీ చూడండి

ట్రెండ్ కు తగినట్లు ఇంటెన్స్ యాక్షన్ మూవీస్ చేయడం ఇష్టం : మాయలేడీ హీరో రాకేష్ వర్రే

ఈఎన్ఈ రిపీట్ బతుకమ్మ పాట థియేటర్లో పండగలా ఉంటుంది: తరుణ్ భాస్కర్

వినూత్నంగా పారడాక్స్ హరికథ చిత్రం వుంటుంది :చిత్రయూనిట్

Sekar Master Car Accident : చిరంజీవితో కాకా ఐటం సాంగ్ చిత్రీకరణ జర్నీలో శేఖర్ మాస్టర్‌కు కారు ప్రమాదం జరిగింది ?

Sree Vishnu : కొత్తదనంతో కూడిన వినోదంతో చంద్రయాన్ ఆకట్టుకుంటుంది : హీరో శ్రీవిష్ణు

తర్వాతి కథనం
Show comments