శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 28 సెప్టెంబరు 2016 (11:08 IST)

బ్యూటీపార్లర్‌కు వెళ్లకుండా ఇంట్లోనే ఫేషియల్ చేసుకోవాలంటే..?

బ్యూటీపార్లర్‌కు వెళ్లకుండా ఇంట్లోనే ఫేషియల్ చేసుకోవాలంటే..? మీ ముఖానికి ఎంతో సేఫ్టీ. మరి ఫేషియల్ ఇంట్లో ఎలా అనుకుంటున్నారా.. ఈ కథనం చదవండి.

బ్యూటీపార్లర్‌కు వెళ్లకుండా ఇంట్లోనే ఫేషియల్ చేసుకోవాలంటే..? మీ ముఖానికి ఎంతో సేఫ్టీ. మరి ఫేషియల్ ఇంట్లో ఎలా అనుకుంటున్నారా.. ఈ కథనం చదవండి. 
 
ముందుగా ఒక కప్పులో నాలుగు టీ స్పూన్ల పాలు, 3 టీ స్పూన్ల రవ్వను తీసుకుని మిక్స్ చేసుకుంటే స్క్రబ్ రెడీ అవుతుంది. దీనిని ముందుగా ముఖానికి పట్టించాలి. పది నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడిగేయాలి. 
 
తర్వాత దోసకాయ రసం రెండు స్పూన్లు, తేనె- 5 చుక్కలు, అరటి పండు గుజ్జు - రెండు స్పూన్లు తీసుకుని బాగా మిక్స్ చేసి ఫేస్‌కు అప్లై చేయాలి. 15 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడిగేయాలి. 
 
అటు పిమ్మట ముల్తానీ మట్టి లేదా సున్నిపిండిని తీసుకుని కాసింత పుదీనా రసం కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేస్తే సరిపోతుంది. ఈ ఫేషియల్‌ను పొడిబారిన చర్మం కలిగిన వారు ఇంట్లోనే చేసుకోవచ్చు. 
 
ఆయిల్ ఫేస్ అయితే ఆరెంజ్ జ్యూస్, ద్రాక్ష రసం, లెమన్ జ్యూస్, టమోటా జ్యూస్ సమానంగా తీసుకుని ముఖానికి మసాజ్ చేస్తే సరిపోతుంది. నార్మల్ స్కిన్ అయితే ఆపిల్ లేదా బొప్పాయి గుజ్జుతో పాలు చేర్చి ముఖానికి పట్టించి మసాజ్ చేయాలి. 
 
ఇలా వారానికి ఓసారి ఇంట్లో ఫేషియల్  చేసుకుంటే బ్యూటీ పార్లర్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. మీ ముఖసౌందర్యం మెరుగవుతుందని బ్యూటీషన్లు చెబుతున్నారు.