శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (17:07 IST)

బాదం పేస్ట్, బొప్పాయి గుజ్జుతో మేలెంత..?

ప్రకాశవంతమైన చర్మం కోసం పెరుగు, తేనె ప్యాక్ వేసుకోండి. పెరుగు, తేనె, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేయాలి.

ప్రకాశవంతమైన చర్మం కోసం పెరుగు, తేనె ప్యాక్ వేసుకోండి. పెరుగు, తేనె,  కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేయాలి. 
 
అలాగే బాదం పేస్ట్, మెత్తని పండిన బొప్పాయి గుజ్జు కలిపి ముఖానికి పట్టించి హాయిగా విశ్రాంతిగా పడుకోండి. 15-20 నిమిషాలు అయిన తర్వాత మృదువైన స్క్రబ్‌తో శుభ్రం చేసి, నీటితో కడిగేస్తే మృదువైన చర్మం చేకూరుతుంది. 
 
శనగపిండి, చిటెకెడు పసుపు, పెరుగు కలిపి పేస్ట్ చేసి ప్రతి రోజు ముఖానికి రాయాలి. అది ఆరిపోయిన తరువాత వృత్తాకార కదలికలను ఉపయోగించి శుభ్రంగా కడగిస్తే ముఖంపై గల జుట్టు తొలగిపోతుంది.