సోమవారం, 25 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 7 అక్టోబరు 2016 (11:47 IST)

అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా.. అయితే, బీట్ రూట్ రసాన్ని తాగండి..

మారుతున్న టెక్నాలజీతో పాటు వ్యక్తిగత ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి. దీంతో అనేక మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ఇలాంటి వారు ఇంగ్లీష్ మందులను వాడుతూ.. రక్తపోటును నియంత్రణలో ఉంచుకునేందుకు ప్రయ

మారుతున్న టెక్నాలజీతో పాటు వ్యక్తిగత ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి. దీంతో అనేక మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ఇలాంటి వారు ఇంగ్లీష్ మందులను వాడుతూ.. రక్తపోటును నియంత్రణలో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి వారు ఇంట్లో చిన్నపాటి చిట్కాలు పాటిస్తే సరిపోతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
అధిక రక్తపుపోటుతో బాధపడేవారు ప్రతి రోజూ బీట్‌రూట్ రసం తీసుకోవడం వల్ల దీన్ని నియంత్రించుకోవచ్చని వైద్య నిపుణులు చెపుతున్నారు. అధిక రక్తపోటు ఉన్నవారిలో కొందరికి మాత్రలకు బదులుగా 200 మి.లీ బీట్‌రూట్‌ రసాన్ని ఇచ్చి 24 గంటల పాటు పరిశీలనలో ఉంచారు. ఆ రసం తీసుకున్న కేవలం మూడు నుంచి ఆరు గంటల్లోనే 10 ఎంఎంహెచ్‌జి రక్తపోటు తగ్గింది. 
 
పైగా ఆ రసం ప్రభావంతో అధిక రక్తపోటు 24 గంటల దాకా నియంత్రణలోనే ఉన్నట్టు వెల్లడైంది. అందువల్ల అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు నైట్రేట్‌ సమృద్ధిగా ఉన్న కూరగాయలు ఆకుకూరలు తరుచుగా తీసుకోవడం ద్వారా తమ రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చని పరిశోధకులు వెల్లడించారు.