1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : మంగళవారం, 14 జూన్ 2016 (17:02 IST)

కంటికి మేలు చేయాలంటే.. స్వీట్ కార్న్ తినండి.. అరటి పండ్ల కంటే..?

సాధారణంగా ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరల్లో విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషక విలువలు దాగి ఉంటాయి. అందువల్ల రెగ్యులర్ డైట్‌లో వీటిని

సాధారణంగా ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరల్లో విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషక విలువలు దాగి ఉంటాయి. అందువల్ల రెగ్యులర్ డైట్‌లో వీటిని తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. పోషక విలువలు కలిగిన వాటిని ప్రతిరోజూ తీసుకుంటే ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు. 
 
అటువంటి పోషక విలువలు కలిగిన ఆహారాల్లో స్వీట్ కార్న్ కూడా ఒకటి. స్వీట్‌కార్న్‌లో విటమిన్‌ బి, సీలతోపాటు మెగ్నీషియమ్‌, పోటాషియం ఖనిజాలున్నాయి. పసుపు పచ్చరంగులో ఉన్న స్వీట్‌కార్న్‌లో ఎక్కువగా ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్‌ కళ్లకు ఎంతో మేలు చేస్తాయి. అరటిపండ్లలో కంటే స్వీట్‌కార్న్‌లో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. 
 
అరటిపండ్లలో 15 గ్రాముల చక్కెర ఉండగా స్వీట్‌కార్న్‌లో 6 నుంచి 8 గ్రాములే ఉంటుంది. పైబర్‌ ఎక్కువగా ఉండటంతోపాటు ఎన్నో పోషకాలున్న స్వీట్‌కార్న్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతోపాటు ఎన్నో పోషకాలుండటంతో స్వీట్ కార్న్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.