సంబంధిత వార్తలు
- కడక్‌నాథ్ చికెన్‌లోని పోషకాలేంటి? నరాల రుగ్మతలకు చెక్
- మూడో అంతస్తు నుంచి స్విమ్మింగ్ పూల్‌లో జారిపడి ఐదేళ్ల బాలుడి మృతి
- పోషకాలు గని షిమ్లా మిర్చి ... ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో.. ఎన్నెన్నో...
- బఠానీలు తింటే కొవ్వు కరుగుతుందా? పెరుగుతుందా?
- అమ్మ కొట్టిందని ఐదవ అంతస్థు నుంచి దూకేసిన బాలుడు.. ఏం జరిగిందంటే?
డైనింగ్ టేబుల్ వద్దు.. నేలపై కూర్చుని భోజనం చేస్తే..?
Eating
కానీ నేటి నాగరికతలో డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని భోజనం చేయడం ఆనవాయితీగా మారింది. అయితే నేల మీద కూర్చుని తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
చాప పరిచి దానికి పై కూర్చుని ముందు విస్తరిలో వున్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అంతేగాకుండా డైనింగ్ టేబుల్ మీద కూర్చుని కాళ్లు ఊపుతూ తినడం వల్ల అనేక శారీరక రుగ్మతలు వస్తున్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
కాళ్లు కిందికి వేలాడుతూ వుంటూ భోజనం చేస్తే నడుము కింది భాగంలో మాత్రమే శరీరంలో రక్తప్రసరణ ఎక్కువగా ఉంటుంది. కానీ కాళ్లు ముడుచుకుని నేలపై కూర్చొని తింటే శరీరమంతా రక్తప్రసరణ ఏకరీతిగా సాగుతుంది.
అందుకే తిన్నప్పుడు రక్తప్రసరణ సాఫీగా సాగితేనే తిన్న ఆహారం తేలికగా జీర్ణమవుతుందన్నారు. కాబట్టి కూర్చొని కాళ్లు ముడుచుకుని తినాలని పూర్వీకుల సలహా. వీలైనంత వరకు నేలపై కూర్చుని తినడం మంచిది.
కింద కాకుండా టేబుల్ భోజనం వల్ల పొట్ట మీద ఒత్తిడి పడకుండా సౌకర్యవంతంగా ఉంటుంది భోజనం. అయితే అసలు కింద కూర్చుని భోజనం చేయడం వల్ల పొట్టమీద ఒత్తిడి పడి కండరాల్లో కదలికలకు కారణం అవుతుంది. ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
నేల మీద కూర్చోవడం వల్ల గుండెకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఇది వెన్ను సమస్యలు, గ్యాస్ సమస్యలను దూరం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
తర్వాతి కథనం
