శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 జులై 2023 (16:05 IST)

అమ్మ కొట్టిందని ఐదవ అంతస్థు నుంచి దూకేసిన బాలుడు.. ఏం జరిగిందంటే?

China Boy
China Boy
చైనాలో ఒక బాలుడు తన తల్లి నుండి తప్పించుకోవడానికి ఐదవ అంతస్తు నుండి దూకిన విషాద సంఘటన నెట్టింట వైరల్ అవుతోంది. 
 
తూర్పు చైనాలోని అన్హుయ్ ప్రావిన్స్‌లో గత నెలలో ఈ ఘటన జరిగింది. ఇంటి లోపల కర్రతో దాడి చేసిన ఆరేళ్ల బాలుడు నివాస భవనంలోని అవుట్‌డోర్ ఏసీ మెషీన్ నుండి దూకాడు. 
 
వీడియోను రికార్డ్ చేసిన వ్యక్తి, చుట్టుపక్కలవారు 'అబ్బాయిని కొట్టవద్దు' అని తల్లిని వేడుకోవడం చూడవచ్చు. కానీ మాట్లాడుతున్నప్పుడు, చిన్న పిల్లవాడు వున్నట్టుండి దూకేశాడు. 
 
ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలుడిని ఆసుపత్రికి తరలించగా, అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే, అతని శరీరంలో చాలా ఫ్రాక్చర్లు ఉన్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.