శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 4 ఆగస్టు 2016 (10:22 IST)

బ్లూ బెర్రీస్ తీసుకోండి.. నడుము కొలతను తగ్గించుకోండి..!

బ్లూ బెర్రీస్ తీసుకోండి.. నడుము కొలతను తగ్గించుకోండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. బ్లూ బెర్రీస్, రాస్బెర్రీస్, బ్లాక్ బెర్రీస్‌లు అధికంగా ఫైబర్, యాంటీ-ఆక్సిడెంట్స్‌ని కలిగి ఉంటాయి. బ్లూ బెర్రీస్ తీసు

బ్లూ బెర్రీస్ తీసుకోండి.. నడుము కొలతను తగ్గించుకోండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. బ్లూ బెర్రీస్, రాస్బెర్రీస్, బ్లాక్ బెర్రీస్‌లు అధికంగా ఫైబర్, యాంటీ-ఆక్సిడెంట్స్‌ని కలిగి ఉంటాయి. బ్లూ బెర్రీస్ తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు నడుము చుట్టూ కొవ్వును తగ్గించుకోవచ్చు. తక్కువ కొలెస్ట్రాల్, రక్తంలోని గ్లూకోస్‌ని కూడా నియంత్రణలో ఉంచుతాయి. 
 
అలాగే సోయా లేదా చిక్కుడు అనేది రుచికరమైన లీన్ ప్రోటీన్‌ని పుష్కలంగా కలిగి ఉంటుంది. అంతేకాకుండా సోయా పాలను ఓట్మీల్ లేదా హోల్-గ్రైన్స్ విత్తనాలలో కలుపుకొని తినటం వలన ఎక్కువ సమయం ఆకలిని కలుగకుండా చేస్తుంది. పచ్చి సోయని కొనుక్కొని తేనెలో కలుపుకొని తినడం ద్వారా బరువు తగ్గుతారు. ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్, ఫైబర్‌లను కలిగి ఉన్న ఫ్లాక్స్ సీడ్స్ బరువు నిర్వహణలో ముఖ్యపాత్రని పోషిస్తాయి. ఇందులో ఉండే ఫైబర్‌లు ఆకలిని తగ్గించివేస్తాయి.
 
అలాగే ఆపిల్‌లో బరువు తగ్గించే గుణాలున్నాయి. ఇందులోని తక్కువ క్యాలరీలను, కొవ్వు పదార్థాలను, తక్కువ సోడియం ఎక్కువగా విటమిన్, మినరల్స్, ఫైబర్‌లను కలిగి ఉంటుంది. కావున బరువు తగ్గటానికి ఉపయోగపడుతుంది.