శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 22 మే 2017 (12:13 IST)

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయం పూట చికెన్ ముక్కలు తీసుకోవచ్చా?

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయం అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యమైన అంశం. ఉదయం పూట ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవటం వల్ల దీర్ఘకాలంలో మధుమేహ నివారణతో పాటు.. రోజంతా చురుకుగా ఉండటం, విషయ గ్రహణ శక్తి మెరుగ్గా ఉం

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయం అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యమైన అంశం. ఉదయం పూట ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవటం వల్ల దీర్ఘకాలంలో మధుమేహ నివారణతో పాటు.. రోజంతా చురుకుగా ఉండటం, విషయ గ్రహణ శక్తి మెరుగ్గా ఉండటం, ఏకాగ్రత పెరగడం, మానసిక చికాకు తగ్గటం వంటి ఇతరత్రా ప్రయోజనాలూ చాలానే ఉంటాయి. 
 
రోజూ మొత్తం మీద పండ్లు, కూరగాయలు మూడు దఫాలుగా తీసుకోవాలి. అల్పాహారంలో కూరగాయల ముక్కలు ఉండేలా చూసుకోవాలి. ఇడ్లీలు, దోసెలు తీసుకుంటే క్యారెట్, బీట్ రూట్ తురుమును కలిపి తీసుకోవాలి. గోధుమ పిండితో చేసుకునే వంటకాలను అధికంగా తీసుకోవాలి. పూరీల కంటే చపాతీలు, మెంతికూర వంటివి తీసుకోవడం ద్వారా షుగర్ లెవల్స్ నియంత్రణలో వుంటాయి. 
 
వీటితో పాటు బ్రౌన్ బ్రెడ్ తీసుకోవాలి. వంట కోసం సన్ ఫ్లవర్ ఆయిల్, రైస్ రిచ్ ఆయిల్స్ వాడటం మంచిది. చాలామంది ఉదయాన్నే అల్పాహారానికి తర్వాత స్వీట్లు తినడం మానేసి.. ఒక అరటి పండో, ఆపిల్‌ పండో, అనాస ముక్కలో, జామ కాయో.. ఇలా ఏదైనా పండు తినటం మంచిది. పంచదార చాలా కొద్దిగా వేసిన వేడివేడి పల్చటి టీ, కాఫీల వంటివి తీసుకోవటం మంచిది. ఉదయపు అల్పాహారంగా మాంసం కూడా తీసుకోవచ్చుగానీ.. కొవ్వు పెద్దగా లేని చికెన్‌, అదీ నూనెలో వేసి వేయించటం వంటివి కాకుండా.. తేలికగా గ్రిల్లింగ్‌ చేసి కొద్దిగా తీసుకోవచ్చు.
 
అయితే పండ్ల రసాలు, తెల్ల బ్రెడ్డు, జామ్‌లు, తేనె, బట్టర్‌, తీపి ఎక్కువగా ఉండే డ్రింకులు, వేయించిన వంటలు, నూనెలు ఎక్కువగా ఉండే పదార్థాలు, తేలికగా జీర్ణమైపోయే ఫ్లేక్స్‌ తదితరాలు, స్వీట్లు ఇలాంటివన్నీ ఉదయపు అల్పాహారంగా మానెయ్యటం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.