1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (16:45 IST)

డయాబెటీస్‌తో బాధపడుతున్నారా? వంకాయ తినండి..

వంకాయ రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వంకాయ తొక్కలో ఉండే యాంథోసియానిన్స్ , యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. వయస్సు ఛాయలు కనిపించనీ

వంకాయ రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వంకాయ తొక్కలో ఉండే యాంథోసియానిన్స్ , యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. వయస్సు ఛాయలు కనిపించనీయవు. శరీరంలో వాపు, నరాల బలహీనత తగ్గించే శక్తి వంకాయలకు ఉందని డైటీషియన్లు చెబుతున్నారు.

ముఖ్యంగా డయాబెటీస్‌తో బాధపడేవారు దీన్ని ఎంత ఎక్కువ తీసుకుంటే అంతమంచిదట. దీనిలో తక్కువ మోతాదులో గ్లిజమిక్ ఇండెక్స్ ఉంటుంది. దీని కారణంగా దీన్ని ఎంత ఎక్కువ తీసుకున్నా ఆరోగ్యానికి హాని చేయదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ఇంకా వంకాయలో వుండే ఫొటో న్యూట్రియంట్స్... ఫ్రీ రాడికల్స్, ఆక్సీకరణ ఒత్తిడి నష్టం నుంచి కణత్వచాన్ని రక్షిస్తాయి. బి-కాంప్లెక్స్ విటమిన్లు ఒత్తిడి లేకుండా ప్రశాంతతను కలిగిస్తాయి. నాడీ చర్య సులభతరంగా మార్చి, షార్ప్ మెమొరీ నిధులను జరిగేలా చేస్తాయి. వంకాయలో ఎక్కువ మోతాదులో విటమిన్ - సీ సమృద్ధిగా లభిస్తుంది.

ఇది ఎంతో ప్రతిభావంతమైన యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియా లక్షణాలను కలిగి వుంటుంది. శరీరంలో హాని కలిగించే బాక్టీరియాలను అంతం చేయడంలో వంకాయ ఎంతోగానో మెరుగ్గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.