ఆదివారం, 26 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (16:04 IST)

క్యాబేజీ ఆకుల్ని నమలండి లేదా జ్యూస్ తాగండి.. దగ్గు మటాష్

క్యాబేజీ దగ్గుకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. క్యాబేజీ ఆకుల్ని నమిలినా లేదా క్యాబేజీ ఆకుల రసాన్ని తాగినా దగ్గు దూరమవుతుంది. అలాగే కీళ్ళ, మోకాళ్ల నొప్పులను దూరం చేసుకోవాలంటే క్యాబేజీ వారానికి రెండుసార్లైన

క్యాబేజీ దగ్గుకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. క్యాబేజీ ఆకుల్ని నమిలినా లేదా క్యాబేజీ ఆకుల రసాన్ని తాగినా దగ్గు దూరమవుతుంది. అలాగే కీళ్ళ, మోకాళ్ల నొప్పులను దూరం చేసుకోవాలంటే క్యాబేజీ వారానికి రెండుసార్లైనా తినాలి. వాపుల్ని తగ్గించడంలో క్యాబేజీ బాగా పనిచేస్తుంది. శరీరంలో ఏదైనా ప్రదేశంలో వాపులుంటే రాత్రి పడుకునే ముందు వాటిపై కొన్ని క్యాబేజీ ఆకులను ఉంచితే సరిపోతుంది. తెల్లవారే సరికి వాపులు తగ్గుముఖం పడతాయి.
 
థైరాయిడ్ గ్రంథులు పనితీరు మెరుగు పడాలంటే రాత్రి పూట పడుకునే ముందు కొన్ని క్యాబేజీ ఆకులను గొంతుపై ఉంచితే సరిపోతుంది. క్యాబేజీ రక్తపోటును నియంత్రిస్తుంది. పచ్చి క్యాబేజీ జ్యూస్ తాగితే ఆశించిన స్థాయిలో ఫలితాలు వస్తాయి. దీన్ని తరచూ తీసుకుంటే దంత సంబంధ వ్యాధులు కూడా తొలగిపోతాయి. బరువు తగ్గడం సులభమవుతుంది. 
 
క్యాబేజీలో ఉండే సల్ఫర్ చర్మానికి అందాన్నివ్వడంతో పాటు వెంట్రుకలను సంరక్షిస్తుంది. క్యాబేజీ ద్వారా శరీరానికి అవసరమైన ఫ్లేవనాయిడ్స్ సమృద్ధిగా అందుతాయని తద్వారా క్యాన్సర్ ప్రభావం తగ్గుతుంది.