వేడినీటితో తల స్నానం చేస్తే ఏమౌతుంది!
కేశాలు అందంగా మృదువుగా ఉండాలని ప్రతియొక్కరు కోరుకుంటారు. నిజానికి మన కేశాలు అందంగా వత్తుగా ఉండాలంటే అది మన చేతుల్లోనే ఉంది. చాలామంది తమకు తెలియకుండానే కేశాల విషయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. దాని వల
కేశాలు అందంగా మృదువుగా ఉండాలని ప్రతియొక్కరు కోరుకుంటారు. నిజానికి మన కేశాలు అందంగా వత్తుగా ఉండాలంటే అది మన చేతుల్లోనే ఉంది. చాలామంది తమకు తెలియకుండానే కేశాల విషయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. దాని వలన కేశాలు వత్తుగా పెరగక పోవడం, రాలిపోవడం వంటివి జరుగుతుంది. అలా మనం చేసే తప్పులేంటో చూద్దాం...
దువ్వెనలు శుభ్రపరచకపోవడంతో అందులో ఉండే దుమ్ము కణాలు నెత్తిమీద పేరుకుపోయి జుట్టును నాశనం చేస్తాయి. కాబట్టి ఎప్పటికప్పుడు దువ్వెనను శుభ్రపరచుకోవాలి. ప్రతిరోజు జుట్టుకు షాంపు వాడితే కుదుళ్ల సమస్య ఏర్పడుతుంది. కాబట్టి వారానికి రెండు నుంచి మూడుసార్లు షాంపూ పెట్టుకుంటే మంచిది. అంతే కాకుండా జుట్టు మొలలకు మాత్రమే షాంపూ వాడితే జుట్టుకు మంచిది.
తల స్నానం చేసేటప్పుడు షాంపూను పూర్తిగా కడగకపొతే కేశాలపై షాంపూ మిగిలిపోయి దుమ్ము పేరుకు పోయేలా చేస్తుంది. తల స్నానం చేసేముందు దువ్వుకొని స్నానం చేస్తే మంచిది. అలా కాకుండా తడి జుట్టుని దువ్వితే తొందరగా పాడవడమే కాకుండా, జుట్టు రాలిపోతుంది.
కొంతమంది స్నానం చేసిన వెంటనే తడి జుట్టుతో పడుకుంటారు. ఇలా చేయడం వల్ల జుట్టు తొందరగా పాడవుతుంది. చాలా మంది తలస్నానం చేసేప్పుడు ఎక్కువ వేడి నీటిని ఉపయోగిస్తుంటారు. వేడి నీరు మీ జుట్టులో రంగును తొలగించి నూనె ఉత్పత్తి చేసే గ్రంధులను యాక్టివేట్ చేస్తుంది. గోరువెచ్చని నీరు ఉపయోగిస్తే జుట్టులో ఉన్న మురికిని తొలగించి, రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది.