1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : సోమవారం, 4 ఏప్రియల్ 2016 (11:13 IST)

కంప్యూటర్‌ను తరుచూ చూస్తున్నారా?

కంప్యూటర్‌ వద్ద ఎక్కువ సేపు కూర్చొని పని చేసే వారికి చూపు మందగించడం జరుగుతుంది. ఇలాంటి సమస్య నుంచి కొంతమేరకైనా విముక్తి పొందాలంటే కొన్ని ఆరోగ్య చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
 
కంప్యూటర్‌పై ఎక్కువ సేపు కూర్చొని పనిచేసే వారు, ఎక్కువ సేపు పుస్తకాలు చదివే వారు ప్రతి అర్థగంట లేదా గంటకు ఒకసారి విశ్రాంతి నిచ్చి దూరపు చూస్తూ విశ్రాంతి తీసుకోవాలని నేత్ర వైద్యులు చూస్తున్నారు.
 
అలాగే, వాహనంలో వెళ్లే సమయంలో కంటిపై నేరుగా వేగంగా వచ్చే గాలి పడకుండా కంటి అద్దాలు ధరించడం లేదా హెల్మెట్ ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కళ్ళలోకి దుమ్మూధూళి పోకుండా ఉంటుంది.
 
అలాగే వెలుతురు సరిగా లేని ప్రాంతాలు, చీకటిలో చదవడం మానుకోవాలి. ఏసీ, వెంటిలేటర్‌ల నుంచి వచ్చే గాలి నేరుగా ముఖంపై వచ్చి పడకుండా చూసుకోవాలి.