గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 19 మార్చి 2017 (17:12 IST)

డీ హైడ్రేషన్ నుంచి తప్పించుకోవాలంటే.. కీరదోస మేలు..

డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవాలంటే.. కీరదోస కాయను అధికంగా తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఇది దాహం తీరుస్తుంది. కీరదోసలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. శరీరంలో తేమ శాతం పెరిగి వేడి తగ్గుతుంది. కీరదోసరసంల

డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవాలంటే.. కీరదోస కాయను అధికంగా తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఇది దాహం తీరుస్తుంది. కీరదోసలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. శరీరంలో తేమ శాతం పెరిగి వేడి తగ్గుతుంది. కీరదోసరసంలో పోటాషియా, మెగ్నీషియం, సోడియం ఎక్కువగా ఉంటాయి. కీరను తినడం వల్ల రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఎముకలని ధృడంగా ఉంచడంలోనూ కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
ఇది టాక్సిన్లను తొలగిస్తుంది. ఖనిజ లవణాలు ఉదర సంబంధిత వ్యాధులతో కీర పోరాడుతుంది. అజీర్తి లేకుండా చేయడం..శరీరంలో కొత్త కణాల వృద్ధికి తోడ్పడుతాయి. బరువు తగ్గాలనుకొనే వారు ఉదయం అల్పాహారంతో పాటు కొన్ని కీరదోస ముక్కల్ని తీసుకుంటే తక్కువ కెలొరీలు ఎక్కువ శక్తి అందుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.