1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 5 అక్టోబరు 2015 (17:05 IST)

పెరుగును ఆహారంలో చేర్చుకోండి.. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోండి..!

పెరుగులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలేంటని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పెరుగులో అధిక మొత్తంలో లభించే కాల్షియం మన ఎముకల్ని దృఢంగా ఉంచడంలో తోడ్పడుతుంది. రోజూ పెరుగు తినేవారిలో ఆస్టియో పోరోసిస్‌ వచ్చే అవకాశాలు కూడా తక్కువని తాజా పరిశోధనలో తేలింది. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్‌ శరీరంలో తెల్ల రక్తకణాలను పెంచుతాయి. దీంతో సహజంగానే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని పరిశోధకులు అంటున్నారు. 
 
పెరుగులో విటమిన్‌ బి12, రైబోఫ్లేవిన్‌, ఫాస్పరస్‌ వంటివి ఎక్కువగా లభిస్తాయి. ఇవన్నీ కూడా శరీర జీవక్రియలు సక్రమంగా జరిగేలా చూస్తాయి. విటమిన్‌ బి12 శరీరంలో ఎర్రరక్తకణాల సంఖ్యను పెంచి, నరాల వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. 
 
ఫాస్పరస్‌ పళ్లను, ఎముకలను బలంగా ఉంచుతుంది. ఇక ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు కొవ్వు పదార్ధాలను శక్తి రూపంలోకి మార్చడానికి ఉపయోగపడతాయి. అలాగే ప్రీమెనుస్ట్రువల్‌ సిండ్రోమ్‌తో బాధపడేవారికి ఈ సమస్యను తగ్గించడంలో పెరుగులో ఉండే మెగ్నీషియం చక్కగా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.