సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 ఆగస్టు 2020 (21:13 IST)

ఎండుకొబ్బరితో మెదడు భేష్‌గా పనిచేస్తుందట..

dry Coconut
ఎండుకొబ్బరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. డ్రై ఫ్రూట్స్ తరహాలో ఎండు కొబ్బరిని తీసుకోవచ్చు. రోజూ వంటకాల్లో ఎండు కొబ్బరి తురుమును చేర్చడం ద్వారా అధిక పోషకాలు ఆరోగ్యానికి లభించినట్లవుతుంది. చర్మానికి ఎండుకొబ్బరి మేలు చేస్తుంది. ఎముకలకు బలాన్నిస్తాయి. కణజాలాలను బలంగా వుంచుతాయి. 
 
ఎండుకొబ్బరిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఖనిజ లోపాన్ని నివారించవచ్చు. ఇంకా ఆర్థరైటిస్, బోలు ఎముకల వ్యాధి వంటి అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎండుకొబ్బరిలో ఫైబర్, కాపర్, సెలీనియం వంటి పోషకాలుంటాయి. అందు కోసమే అనేక రకాలుగా ఎండుకొబ్బరిని వినియోగిస్తారు.
 
రోజూ చిన్న ఎండుకొబ్బరి ముక్క తింటే... అందులోని ఫైబర్ వల్ల గుండెకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఎండుకొబ్బరి మెదడుకు ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం ద్వారా మతిమరపు సమస్యలు దూరమవుతాయి. ఎండుకొబ్బరి రకరకాల వ్యాధుల్ని రాకుండా చేస్తుంది. ఎందుకంటే అది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులోని పోషకాలు నిత్య యవ్వనాన్నిచ్చేలా వుంటాయి. 
 
అలాగే క్యాన్సర్‌ను దూరం చేస్తాయి. ముఖ్యంగా పేగుల్లో కాన్సర్, ప్రొస్టేట్ కాన్సర్‌కి ఎండుకొబ్బరి చక్కటి మందులా పనిచేస్తుంది. అల్సర్‌ను దరిచేర్చదు. గుడ్ కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. గుండె సంబంధిత రోగాలకు చెక్ పెడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.