సోమవారం, 6 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : బుధవారం, 21 సెప్టెంబరు 2016 (15:47 IST)

డార్క్ చాక్లెట్‌ తినండి.. లోబీపీని తగ్గించుకోండి...

వర్క్ టెన్షన్‌తో చాలామంది మహిళలు వీలు దొరికినపుడల్లా టీ, కాఫీలు వేళాపాళా లేకుండా సేవిస్తుంటారు. అయితే, టీ కాఫీలు తాగడం కంటే.. ప్రతి రోజూ ఒక చాక్లెట్ తింటే లో బీపీతో పాటు పని ఒత్తిడిని నియంత్రించవచ్చున

వర్క్ టెన్షన్‌తో చాలామంది మహిళలు వీలు దొరికినపుడల్లా టీ, కాఫీలు వేళాపాళా లేకుండా సేవిస్తుంటారు. అయితే, టీ కాఫీలు తాగడం కంటే.. ప్రతి రోజూ ఒక చాక్లెట్ తింటే లో బీపీతో పాటు పని ఒత్తిడిని నియంత్రించవచ్చునని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తాజాగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
 
రోజూ ఒకటి లేదా రెండు డార్క్ చాక్లెట్లను సమయం దొరికినప్పుడల్లా తింటే లోబీపీ, ఒత్తిళ్లు దూరమవుతాయట. ఒక గ్రూపు వ్యక్తులపై సైంటిస్టులు నిర్వహించిన అధ్యయనంలో రోజూవారీగా రెండు చాక్లెట్లు తీసుకునే వారిలో ఒత్తిడి, లోబీపీ మాయమవుతున్నట్లు తేలిందని వారు తెలిపారు. డార్క్ చాక్లెట్‌లోని కెలోరీలు లోయర్ బ్లడ్ షుగర్‌కు చెక్ పెడుతుందనే విషయాన్ని కనుగొన్నట్టు చెప్పారు.