రోజూవారీ డైట్‌లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. బ్రొకోలి.. బాదం పప్పులు తీసుకుంటే?
చాలామంది బతకడానికి ఏదోకటి తినాలని తింటుంటారు. కాని ఏం తింటున్నారో కూడా పట్టించుకోరు. విటమిన్లు, ఖనిజాలు, పోషకపదార్థాలు ఎక్కువ ఉండే ఆహారపదార్థాలు శరీరాన్ని ఎంతో ఆరోగ్యకరంగా ఉంచుతాయి. ఫైటోన్యూట్రియంట్స్
చాలామంది బతకడానికి ఏదోకటి తినాలని తింటుంటారు. కాని ఏం తింటున్నారో కూడా పట్టించుకోరు. విటమిన్లు, ఖనిజాలు, పోషకపదార్థాలు ఎక్కువ ఉండే ఆహారపదార్థాలు శరీరాన్ని ఎంతో ఆరోగ్యకరంగా ఉంచుతాయి. ఫైటోన్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-ఎ, విటమిన్-ఇ, వంటివి కూడా మనం తినే ఆహారంలో తప్పనిసరిగా ఉండే విధంగా చూసుకోవాలి. అలాంటి బలవర్థకమైన ఆహారపదార్థాలు క్రమం తప్పకుండా రోజూవారీ డైట్‌లో తీసుకుంటే ఆరోగ్యంగా ఉంచడంతో పాటు యంగ్‌గా ఉండేందుకు సహకరిస్తుంది.
యాపిల్స్‌లో పీచుపదార్థాలు, విటమిన్-సి లు పుష్కలంగా ఉంటుంది. బ్లూ బెర్రీస్‌లో ఫైటోన్యూట్రియంట్స్ బాగా ఉంటాయి. ఇవి గుండెజబ్బులు, డయాబెటిస్ లాంటి క్రానిక్ అనారోగ్య సమస్యలు తలెత్తకుండా కాపాడుతుంది. జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది. వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలు రాకుండా అరికడుతుంది.
బాదం పప్పుల్లో పోషకాలు పుష్కలంగా లభిస్తుంది. పీచుపదార్థాలు, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ ఇందులో ఉంటాయి. బాదం పప్పులు తింటే గుండెకు ఎంతో మంచిది. వీటిల్లో ఉండే మోనోసాచ్యురేటెడ్ ఫ్యాట్ ఆరోగ్యవంతమైంది. ఇది రక్తంలోని కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను తగ్గించడానికి తోడ్పడుతుంది.
పచ్చరంగులో ఉండే బ్రొకోలీలో ఫైటోన్యూట్రియంట్స్‌తోపాటు విటమిన్- సి కూడా అధికంగా ఉంటుంది. ఇందులో విటమిన్-ఎ కూడా అధికంగా ఉంటుంది. కంటి ఆరోగ్యానికి ఇది ఎంతో మంచిది.