1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 12 జూన్ 2024 (20:51 IST)

ఈ 7 పదార్థాలు శరీరంలో యూరిక్ యాసిడ్‌ని పెంచుతాయి, ఏంటవి?

యూరిక్ యాసిడ్. ఇటీవలి కాలంలో ఈ సమస్యతో సతమతం అయ్యేవారు ఎక్కువవుతున్నారు. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎలాంటి పదార్థాలు తింటే ఎక్కువ అవుతాయో తెలుసుకుందాము.
 
రెడ్ మీట్‌లో ప్యూరిన్‌లు ఎక్కువగా ఉంటాయి. గౌట్ ఉన్న వ్యక్తి రెడ్ మీట్ తినడం పరిమితం చేయాలి.
సీఫుడ్ అయినటువంటి పీతలు, రొయ్యలు షెల్ఫిష్‌లలో ప్యూరిన్లు ఎక్కువగా ఉంటాయి కనుక వీటిని తినరాదు
అధిక చక్కెర కంటెంట్‌తో కూడిన సోడా మరియు పండ్ల రసాలు వంటి పానీయాలు గౌట్ దాడుల ప్రమాదాన్ని పెంచుతాయి.
మిఠాయిలు, పేస్ట్రీలు, ఇతర స్వీట్‌లలో ప్యూరిన్‌లు ఎక్కువ, అందుకే అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ ఉన్న ఆహారాన్ని పరిమితం చేయాలి.
యాపిల్స్, నారింజ, ఖర్జూరాలు సహజంగా అధిక ఫ్రక్టోజ్ కంటెంట్ కలిగిన పండ్లు కనుక వీటిని తినకూడదు.
మద్యం ముఖ్యంగా బీర్ యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతుంది. కనుక దీన్ని తీసుకోరాదు.
అధిక కొవ్వు పాల ఉత్పత్తులను తీసుకుంటే యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగే అవకాశం వుంటుంది.