శరీర బరువును తగ్గించే గోంగూర
గోంగూరను ఆహారంలో భాగంగా చేసుకుంటే చెడు కొలెస్ట్రాల్ దూరం అవుతుంది. గోంగూరలో విటమిన్ ఏబీసీలు పుష్కలంగా వున్నాయి. అంతేగాకుండా ఫాస్పరస్, సోడియం, ఐరన్, పొటాషియం కూడా వున్నాయి. ఇందులోని ప్రోటీన్స్, కార్పొహైడ్రేట్స్ అధికంగా వుండి కొవ్వు తక్కువగా వుంటుంది. గోంగూరలోని విటమిన్ ఎ కంటి దృష్టిని మెరుగుపరుస్తుంది.
ఇందులోని కార్బొహైడ్రేట్స్, ప్రోటీన్స్ శరీర బరువును తగ్గిస్తాయి. ఇంకా గోంగూర చర్మ సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. ఇంకా నిద్రలేమిని, అధిక రక్తపోటును తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే గోంగూరలో ఫోలిక్ యాసిడ్స్, మినరల్స్ కూడా అత్యధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తాయి. గుండె, కిడ్నీ సంబంధ వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్ లాంటి భయంకర వ్యాధులను కూడా నివారించడానికి గోంగూర ఉపయోగపడుతుంది. దగ్గు, ఆయాసం, తుమ్ములతో ఇబ్బంది పడేవాళ్లు ఏదో ఒక రూపంలో గోంగూరను తీసుకుంటే సహజ ఔషధంలా పనిచేస్తుంది.