శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 19 మార్చి 2017 (17:08 IST)

వేరుశెనగ నూనెను వాడండి.. అంటువ్యాధులను దూరం చేసుకోండి..

వేరుశెనగలో యాంటీ ఆక్సిడెంట్ గుండెజబ్బుల బారినుంచి కాపాడుతుంది. క్యాన్సర్‌ రిస్క్‌నూ తగ్గిస్తుంది. వార్ధక్యపు ఛాయలనూ దరిచేరనివ్వదు. గుండెజబ్బుల్ని నివారించే కొన్నిరకాల మందుల్లో వేరుశెనగ సుగుణాలుంటాయి.

వేరుశెనగలో యాంటీ ఆక్సిడెంట్ గుండెజబ్బుల బారినుంచి కాపాడుతుంది. క్యాన్సర్‌ రిస్క్‌నూ తగ్గిస్తుంది. వార్ధక్యపు ఛాయలనూ దరిచేరనివ్వదు. గుండెజబ్బుల్ని నివారించే కొన్నిరకాల మందుల్లో వేరుశెనగ సుగుణాలుంటాయి. శరీరానికి మంచి చేసే మోనోఅన్‌శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ 50 శాతం మేరకు కలిగి ఉండే వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవటంవల్ల క్యాన్సర్ ముప్పు తొలగుతుంది, అంతేగాకుండా కొలెస్ట్రాల్ శాతం అదుపులో ఉంటుంది.
 
అలాగే వేరుశెనగ నూనెలో ఉన్న రెస్వెట్రాల్‌, పోలీఫెనాల్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధిక స్థాయిలో ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది.  ఇందులోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ కణాలను నశింపజేస్తుంది. నూనెలో విటమిన్‌ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని సంరక్షిస్తుంది. ఉండే రెస్వెట్రాల్‌ ఆకట్టుకునే స్థాయిలో రోగనిరోధక వ్యవస్థను పటిష్టంగా ఉంచుతుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్‌ ప్రత్యేకించి వైరల్‌ అంటువ్యాధులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది.
 
వేరుశెనగలో బి కాంప్సెక్స్ విటమిన్స్ అధికంగా ఉంటాయి. ఇంకా రిబోఫ్లెవిన్, థైమిన్, విటమిన్ బి, ఫాంటోథెనిక్ యాసిడ్స్ మెదడును చురుకుగా ఉంచడంతో పాటు, రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. ఎముకల నిర్మాణానికి కావల్సిన క్యాల్షియం, ఐరన్‌ను అందిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.