Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుడప్పుడు ఆఫీసుకు లీవ్ పెట్టేస్తున్నారా?

Updated: శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (15:57 IST)
రోజంతా అలసటగా ఉందా? అనారోగ్య సమస్యలతో అప్పుడప్పుడు ఆఫీసుకు లీవ్ పెట్టేస్తున్నారా? ఎక్కువగా పనిచేయకపోయినా అలసట ఆవహిస్తుందో.. ఆరోగ్యంపై తప్పకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలంటున్నారు నిపుణులు. శరీరంలో బ్లడ్ ప్రెజర్ తక్కువగా ఉన్నా.. ఎనర్జీ లేకపోయినా అలసట తప్పదు.
 
ఇంకా రోజంతా అలసట, నీరసంగా ఉన్నట్లైతే అది గుండె సంబంధిత రోగాలకు గుర్తని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శరీరంలో తగినంత రక్తప్రసరణ లేకపోవడంతో పాటు శరీరంలోని బ్లడ్‌సెల్స్ సరిగ్గా పనిచేయకపోవడం ద్వారా హృద్రోగ వ్యాధులకు దారి తీస్తుంది. 8 గంటల నిద్రకు తర్వాత చురుగ్గా పనిచేయాలంటే తప్పకుండా అల్పాహారం తీసుకోవాలి. అల్పాహారంలోనే రోజంతా పనిచేసేందుకు కావలసిన పోషకాలున్నాయి. అయితే సింపుల్‌‍గా టైమ్ లేదనో ఇతరత్రా కారణాల చేత టిఫిన్ తీసుకోకుండా పోవడం ద్వారా ఆరోగ్యానికి అనేక సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
అందుచేత అల్పాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. నీరు ఎక్కువగా తీసుకోవాలి. జంక్ ఫుడ్‌ తీసుకోవడాన్ని నివారించాలి. రోజుకు అరగంటైనా వ్యాయామం చేయాలి. రోజుకు 8 గంటల పాటు నిద్రపోవాలి. హాలీడేస్ లోనూ ఇదే సమయాన్ని ఫాలో చేయాలి. సమయానికి ఆహారం తీసుకోవాలి. అప్పుడప్పుడు ఉద్వేగానికి లోనుకాకూడదు. ఒత్తిడిని దూరంగా ఉంచాలి. మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. విటమిన్ బి12 లోపం ఉంటే అలసట ఆవహిస్తుంది. అందుచేత వారానికి రెండుసార్లు పరిమితంగా మాంసాహారం తీసుకోవాలి.

అన్నీ చూడండి

ఏయ్ దూరం పాటించు అని చెప్పిన మహిళా బైకర్‌ను కారుతో ఢీకొట్టాడు, వీడియో

మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్‌ను పట్టిస్తే 70 లక్షల పాక్ రూపాయలు

మహిళతో వివాహేతర సంబంధం - రూ.29 కోట్ల నిధుల దుర్వినియోగం - అరెస్టు

ఖైరతాబాద్ గణేశుడికి గవర్నర్ తొలి పూజ... సీఎం చంద్రబాబు నివాసంలో చవితి వేడుకలు

మద్యం మత్తులో మహిళా బైకరును వేధించిన అకతాయిలు..

అన్నీ చూడండి

మాతృత్వంలోకి అడుగుపెడుతున్న తరుణంలో శ్రీకల్పం వేడుకను పాటించిన సమంత

ఉన్నట్టుండి ఫ్రేమ్‌లోకి వచ్చిన త్రిష - ముఖం తిప్పేసుకున్న సీఎం విజయ్ (వీడియో)

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

తర్వాతి కథనం
Show comments