క్యాప్సికమ్ తినండి.. కొవ్వును కరిగించుకోండి.. కండరాల నొప్పికి చెక్ పెట్టండి..
క్యాప్సికమ్ తినండి.. కొవ్వును కరిగించుకోండి అంటున్నారు. ఆరోగ్య నిపుణులు. బెల్ పెప్పర్లలో విటమిన్ ఎ, సి సమృద్దిగా లభిస్తాయి. వీటిలోని యాంటి ఆక్సిడెంట్స్ గుణాలవల్ల హృద్రోగ సమస్యలను సులభంగా దూరం చేసుకోవ
క్యాప్సికమ్ తినండి.. కొవ్వును కరిగించుకోండి అంటున్నారు. ఆరోగ్య నిపుణులు. బెల్ పెప్పర్లలో విటమిన్ ఎ, సి సమృద్దిగా లభిస్తాయి. వీటిలోని యాంటి ఆక్సిడెంట్స్ గుణాలవల్ల హృద్రోగ సమస్యలను సులభంగా దూరం చేసుకోవచ్చు. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. వీటిలో ఉండే విటమిన్ - బి6, ఫోలేట్ లు కార్టియోవాస్క్యులర్ వ్యాధులతో పోరాడటంలో సహకరిస్తాయి. వీటిలో పీచు అధికంగా లభిస్తుంది.
క్యాప్సికమ్‌లోని థెర్మోజెనెసిస్ ద్వారా జీవ ప్రక్రియ మెరుగవుతుంది. కొవ్వును కరిగించడంలో ఇది ఎంతగానో సహకరిస్తుంది. మామూలు మిరప కాయల్లో కేప్సేసిస్ ఉంటుంది.ఈ రసాయనం వల్లే అవి కారంగా ఉండి, క్యాలరీలను కరిగించడంలో సహకరిస్తాయి.
ఆహారంలో కారం లేని ఈ క్యాప్సికంను భాగం చేసుకుంటే, జీవక్రియ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. చర్మ సంరక్షణకు ఇది బాగా ఉపయోగపడుతుంది. కండరాల నొప్పితో బాధపడే వారికి క్యాప్సికం దివ్యమైన ఔషదం. ఊపిరితిత్తులకు, కంటి దృష్టిని మెరుగు పరచడానికి క్యాప్సికం బాగా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.