గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 2 మార్చి 2017 (17:25 IST)

మందులు వాడుతున్నారా? ఐతే కొబ్బరి నీళ్లు తప్పక తాగండి..

కొబ్బరినీళ్లు వేసవిలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. రోజూవారీగా గ్లాసుడు తీసుకుంటే కిడ్నీ సమస్యలను దూరం చేసుకోవచ్చు. పిల్లలకు కొబ్బరి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. శరీరానికి శక్తినిచ్చే కొబ

కొబ్బరినీళ్లు వేసవిలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. రోజూవారీగా గ్లాసుడు తీసుకుంటే కిడ్నీ సమస్యలను దూరం చేసుకోవచ్చు. పిల్లలకు కొబ్బరి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. శరీరానికి శక్తినిచ్చే కొబ్బరినీటిలో ఔషధ గుణాలెన్నో ఉన్నాయి. మందులు ఎక్కువగా తీసుకునే వారు కొబ్బరి నీరును తీసుకుంటే.. మందులతో శరీరానికి కలిగే ఓవర్ డోస్ దుష్పలితాలను దూరం చేసుకోవచ్చు.  
 
కొబ్బరి నీటిలో సోడియం, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. వీటితో పాటు విటమిన్స్, అమినో యాసిడ్స్ వున్నాయి. వీటిలో పొటాషియం ఎక్కువగా ఉండటం ద్వారా కిడ్నీ వ్యాధిగ్రస్థులు అధికంగా తీసుకోకూడదు. వేసవిలో చెమటతో ఏర్పడే చర్మ వ్యాధులను దూరం చేసుకోవాలంటే కొబ్బరి నీరు తాగాల్సిందే. ఇది శరీరానికి శక్తినివ్వడంతో పాటు.. చర్మ సమస్యలను దరిచేరనివ్వకుండా చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.