బుధవారం, 18 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 8 జూన్ 2023 (17:56 IST)

అటుకులతో చేసిన పోహాను అల్పాహారంగా తీసుకుంటే?

poha
పోహా. ఈ అల్పాహారం పోహను అటుకులతో తయారుచేస్తారు. ఉత్తరాదిన ఇది బాగా పాపులర్. బరువు తగ్గాలనుకునేవారు ఉదయాన్నే పోహాను అల్పాహారంగా తింటారు. ఇది సులభంగా జీర్ణమవుతుంది. ఈ పోహా తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పోహా లాక్టోస్ లేనటువంటి కొవ్వురహిత పదార్థం. ఇది గుండెకి ఆరోగ్యకరమైనది. ఇందులో గ్లూటెన్ వుండదు, గోధుమ ఉత్పత్తులకు అలెర్జీ ఉన్నవారు దీనిని తినవచ్చు. తక్షణ శక్తికి మంచి మూలం, పోహా తింటే కడుపు నిండిన భావన కలగడటంతో ఎక్కువ ఆకలి వేయదు.
 
అటుకులతో చేయబడిన ఈ పోహా సులభంగా జీర్ణమవుతుంది. విటమిన్ బి 1ను కలిగి వుంటుంది కనుక రక్తంలో చక్కెరను స్థిరీకరించడంలో సహాయపడుతుంది. వేరుశెనగలను సాధారణంగా పోహా తయారీలో కలుపుతారు కనుక యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్లకు మంచి మూలం. పోహా మంచి ప్రోబయోటిక్‌గా పనిచేస్తుంది, ఇందులో కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి.