Daily Horoscope
✕

నేరేడు పండ్లు తింటే.. ఇక డయాబెటిస్ దరిదాపుల్లోకైనా రాదట..

Written By సందీప్
Updated: మంగళవారం, 2 జులై 2019 (14:26 IST)
సమ్మర్‌లో ఎక్కువగా లభించే ఫ్రూట్స్‌లో నేరేడు ఒకటి. వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఈ పండ్లను ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. దీనిలో ఉన్న చక్కెరలో గ్లూకోజ్‌, ప్రక్టోజ్‌లు ముఖ్యమైనవి. నేరేడుని జామ్‌లు, వెనిగర్‌, సాండీస్‌, ఆల్కహాల్‌ తక్కువశాతం ఉండే వైన్‌ల తయారీలో వాడుతుంటారు. 
 
నేరేడు పండ్లలో అతి తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల ఇవి డయాబెటిక్ పేషంట్లకు చాలా మంచిది. ఇది డయాబెటిక్ రోగుల్లో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్లో ఉంచడమే కాక, సాధరణంగా వచ్చే డయాబెటిక్ లక్షణాలు తరచూ దాహం మరియు తరచూ యూరినేషన్ వంటి లక్షణాలను నివారిస్తుంది. 
 
గింజల్ని ఎండబెట్టి పొడిగా చేసుకుని నీటిలో కలుపుకుని తాగితే శరీరంలో చక్కెర నిల్వలు తగ్గుతాయి. నేరేడు పండ్లలో పొటాషియం కంటెంట్ అత్యధికంగా ఉంటుంది . 100 గ్రాముల పండ్లలో 55 మి.గ్రాల పొటాషియం ఉంటుంది. యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ముదురురంగు ఆహారాలైన నేరేడు పండ్లు మరియు టమోటా వంటి పండ్లను తరచూ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. 
 
నేరేడు పండ్లలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వల్ల దంత సమస్యలను నివారించే అనేక మందుల్లో వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. నేరేడు పళ్లను తీసుకునే వారిలో పళ్లు, చిగుళ్లు బలంగా ఉంటాయి. ఆకుల్ని దంచి కషాయంగా కాచి పుక్కిలిస్తే దంతాలు కదలడం, చిగుళ్ల వాపులు, పుండ్లు వంటివి త్వరగా తగ్గుతాయి. ఆకులను నమిలి నీళ్లతో పుక్కిలించి ఉమ్మి వేస్తుంటే నోటి దుర్వాసన తగ్గుతుంది.
 
వేసవిలో వేడి వాతావరణం వల్ల మన శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుతుంది. నేరేడు పండ్లలో ఉండే క్యాల్షియం, ఐరన్, పొటాషియం, మరియు విటమిన్ సి శరీరంలో ఎముకలు బలంగా ఉండేదుకు సహాయపడుతుంది. నేరేడులో విటమిన్‌-ఎ, సి వంటి పోషకాలుంటాయి. ఇవి కళ్లు, చర్మం ఆరోగ్యానికి మంచివి. సహజసిద్ధంగా బ్లడ్ ప్రెజర్‌ని కంట్రోల్ చేసే లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.

అన్నీ చూడండి

ఓడిపోయిన తర్వాత కూడా నేను పనికిరానా? జగన్‌కు శ్రీరెడ్డి ప్రశ్న (వీడియో)

భద్రాచలంలో ఆకస్మిక వరదల ముప్పు.. అలెర్ట్ జారీ

తిరగబడిన కడప పౌరుషం - జగన్‌ను కింద కూర్చోబెట్టిన ఓటర్లు.. పేరుకుపోయిన ఏకఛత్రాధిపత్యానికి తెర

అమెరికాలో మధ్యంతర ఎన్నికలు : అధికార రిపబ్లిక్ పార్టీకి షాక్.. చరిత్ర సృష్టిస్తున్న డెమోక్రాట్లు

బస్ కండక్టర్ ప్రవళిక మృతి.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం

అన్నీ చూడండి

లైఫ్ లో బిజీగా గడుపుతూ జ్ఞాపకాలు కోల్పోతున్నాం. అందుకే సమ్మర్ హాలిడేస్ వస్తుంది

Neha Shetty: మదరాసి రబ్బరుబొమ్మ నేహా శెట్టి తో టైసన్ నాయుడు ప్రోమో సిద్ధమైంది

Nagarjuna, Tabu: అందమైన టబు కోసం కింగ్ 100 గ్లింప్స్ రిలీజ్ చేసిన నాగార్జున

Radhika Apte: మామతో రొమాన్స్ చేశానన్న రాధిక ఆప్టే మాటకు నెటిజన్లు ఫైర్

Nayanatara: మహాశక్తి సినిమా కోసం ప్రమోషన్ చేస్తూ దైవిక ఆశీస్సులు కోరుతున్న నయనతార

తర్వాతి కథనం
Show comments