శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : సోమవారం, 1 జులై 2019 (18:35 IST)

శృంగార సామర్థ్యాన్ని పెంచే ఆకుకూర ఏంటో తెలుసా?

ఆకుకూరల వలన మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందని మనకు తెలుసు. రకరకాల ఆకుకూరల వలన అనేక ఉపయోగాలు ఉంటాయి. వారంలో రెండు రోజులైనా ఆకుకూరలు తింటే రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. అయితే అన్నింటికంటే పాలకూరలో విటమిన్-ఇ ఎక్కువగా ఉంటుంది. వారంలో రెండుసార్లు పాలకూరను తింటే ఎంతో మంచిదట.
 
ప్రతి ఒక్కరు పాలకూర తినాలని వైద్యుల సలహా. విటమిన్ ఇ కాకుండా విటమిన్ సి, ఖనిజ లవణాలు, కాల్షియం లభిస్తాయి. రక్తహీనతకు చెక్ పెడుతుందట. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుందట. దాంతోపాటు అధిక రక్తపోటును తగ్గిస్తుందట. 
 
పాలకూర తీసుకుంటుంటే జుట్టు అందంగా పెరుగుతుంది. మతిమరుపు కూడా దూరమవుతుంది. ఎముకలను బలంగా ఉంచుతుంది. గుండె జబ్బులు, పలు రకాల క్యాన్సర్లను దరిచేరనివ్వదు. శారీరక ఎదుగుదలకు బాగా దోహదపడుతుంది. అలాగే శృంగార సామర్థ్యాన్ని కూడా బాగా పెంచుతుందట.