శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 1 జులై 2019 (19:28 IST)

ఓట్స్ అలాంటి వారికి ఆరోగ్యకరమైన అల్పాహారం...

ఇటీవల కాలంలో ఓట్స్‌ను మంచి పొషక విలువలు ఉన్న ఆహారంగా పరిగణిస్తున్నారు. సాధారణంగా ఓట్స్ చిరుధాన్యంతో తయారుచేసిన బ్రేక్‌పాస్ట్. ఇవి మధుమేహగ్రస్తులకు మరియు హై బ్లడ్ ప్రెజర్ ఉన్న వారికి ఒక మంచి ఆరోగ్యకరమైన ఆహారపదార్దము. అయితే కొంతమంది ఓట్స్‌ను తినడానికి ఇష్టపడరు. వీటిని మనం ఆరోగ్యం కోసం రకరకాల పద్దతిలో రుచికరంగా తయారుచేసుకుని తినవచ్చు. అదెలాగో చూద్దాం.
 
1. సాధారణంగా ఓట్స్‌ను పాలల్లో నానబెట్టుకుని తింటాము. వెజిటేబుల్స్ లేదా చికెన్ సూప్‌ను తయారుచేసి, ఆ సూప్‌లో ఓట్స్ ఉడికించి తీసుకోవచ్చు. ఇలా చేయడం వలన రుచితో పాటు మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి.
 
2. ఓట్స్ ఎక్కువ రుచిగా ఉండేందుకు, ఓట్స్‌లో మసాలా దినుసులు, పెప్పర్, జీలకర్ర మరియు డ్రై మ్యాంగో పౌడర్‌ను ఉపయోగించి వీటిని మరింత రుచికరంగా తయారుచేసుకోవచ్చు.
 
3. ఓట్స్ బ్రేక్‌పాస్ట్ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అలాగే గుడ్లు కూడా ఆరోగ్యానికి మంచిది. ఓట్స్, గుడ్లుతో తయారుచేసిన బ్రేక్‌పాస్ట్‌లో క్యాలరీ మరియు అధిక న్యూట్రీషియన్స్‌ను కలిగి ఉంటాయి.
 
4. డ్రై ప్రూట్స్ ఆరోగ్యకరమైన స్నాక్ పుడ్. ఇవి మనకు తగినంత ఎనర్జీని, బ్రెయిన్ పవర్‌ని పెంచుతాయి. కాబట్టి ఓట్స్‌లో డ్రై ప్రూట్స్ చేర్చుకుని తినడం వల్ల అధిక ఎనర్జీని పొందవచ్చు.
 
5. ఓట్స్ చాలా ఆరోగ్యకరమైనవి కాబట్టి వీటితో పాటు ఆరోగ్యకరమైన పండ్లను సలాడ్ రూపంలో తీసుకోవడం వలన పూర్తి న్యూట్రిషియన్స్ శరీరానికి అందుతాయి.