ఆదివారం, 19 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 15 డిశెంబరు 2023 (15:31 IST)

బొప్పాయి గింజలు ఆరోగ్యానికి మేలు చేస్తాయా?

Papaya seeds
బొప్పాయి గింజలు ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లకు మంచి మూలం. అదనంగా, వాటిలో జింక్, ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం వంటి విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఈ బొప్పాయి గింజలు చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. బొప్పాయి గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరం నుండి వ్యర్థాలను తొలగించడానికి దోహదపడతాయి.
 
బొప్పాయి గింజల్లో కార్పైన్ అనే పదార్ధం ఉంటుంది, ఇది ప్రేగులలోని పురుగులు, బ్యాక్టీరియాను చంపుతుంది. బొప్పాయి గింజలు మలబద్ధకాన్ని నివారించి జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
బొప్పాయి గింజలు తీసుకుంటుంటే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.

బొప్పాయి గింజల్లో వుండే బలమైన యాంటీఆక్సిడెంట్లతో శరీరంలో అనేక రకాల క్యాన్సర్ల నుండి రక్షణ కలుగుతుంది. బొప్పాయిలో ఉండే కెరోటిన్, ఈస్ట్రోజెన్ లాంటి హార్మోన్ ఉత్పత్తిని నియంత్రించి పీరియడ్స్ పెయిన్‌ని అడ్డుకుంటుంది. బొప్పాయి గింజల సారాన్ని తీసుకోవడం వల్ల బ్యాక్టీరియాను సమర్థవంతంగా అడ్డుకోవచ్చు.