గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 30 జూన్ 2023 (17:06 IST)

ముల్లంగి తింటే ఆకలి పెరుగుతుందట..

radish
మనం రోజూ తినే అత్యంత పోషక విలువలు కలిగిన కూరగాయలలో ముల్లంగి ఒకటి. ముల్లంగి తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ముల్లంగిలో విటమిన్ బి, సి, కె, పొటాషియం, ఫైబర్ సహా అనేక పోషకాలు ఉన్నాయి.
 
ముల్లంగిలో ఆంథోసైనిన్‌లు పుష్కలంగా ఉంటాయి, ఇవి గుండెను బలోపేతం చేయడానికి అవసరం. ముల్లంగి తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ముల్లంగి ఇన్సులిన్ చర్యను పెంచుతుంది రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది.
 
ముల్లంగిలో విటమిన్ సి ఉంటుంది, ఇది శరీరానికి అవసరమైన రోగనిరోధక శక్తిని అందిస్తుంది. దీన్ని తినడం వల్ల ఆకలి పెరుగుతుంది. ముల్లంగి తినడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడి ఆహారం బాగా జీర్ణమవుతుంది.  
 
ముల్లంగి తినడం వల్ల కాలేయంలోని వ్యర్థాలు తొలగిపోయి శరీరం శుభ్రపడుతుంది. ముల్లంగిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మూత్రపిండాలు, కాలేయం ఆరోగ్యంగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.