మంగళవారం, 2 జులై 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 28 జూన్ 2023 (13:53 IST)

వంకాయను ఉడకబెట్టి తేనెలో కలుపుకుని తింటే ఏమవుతుంది?

brinjal
వంకాయ అత్యంత పోషకమైన కూరగాయల్లో ఒకటి. ఈ వంకాయ కొందరికి ఎలర్జీ కలిగిస్తుంది. అయినప్పటికీ దాని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము. వంకాయను ఉడకబెట్టి తేనెతో కలిపి సాయంత్రం పూట తింటే నిద్రలేమి సమస్యను లేకుండా చేస్తుంది. వంకాయ పులుసు, వెల్లుల్లిని అన్నంలో కలిపి తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్ తగ్గుతుంది.
 
మధుమేహ వ్యాధిగ్రస్తులు వంకాయతో చేసిన పదార్థాలను తింటే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. వంకాయ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది, గుండె సమస్యలను నివారిస్తుంది. వంకాయను వేయించి తొక్క తీసి అందులో కొద్దిగా ఉప్పు కలిపి తింటే గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎసిడిటీ, జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి.
 
వంకాయ రసం నుండి తయారైన లేపనాలు, టింక్చర్లను హెమోరాయిడ్స్ చికిత్సలో ఉపయోగిస్తారు. వంకాయ కూర అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది.