నల్ల నువ్వులను తినండి.. ఉబ్బసానికి చెక్ పెట్టండి.. బరువు తగ్గాలంటే?
నువ్వులు తినడమేమిటి..? వాటిని తింటే వేడి చేస్తుంది అనుకునేరు. నువ్వుల్లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. నువ్వుల్ని తినడం ద్వారా మోకాళ్లు, కీళ్ల నొప్పులను దూరం చేసుకోవచ్చు. ఇంకా బరువు తగ్గొచ్చు. నువ్వుల్లో
నువ్వులు తినడమేమిటి..? వాటిని తింటే వేడి చేస్తుంది అనుకునేరు. నువ్వుల్లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. నువ్వుల్ని తినడం ద్వారా మోకాళ్లు, కీళ్ల నొప్పులను దూరం చేసుకోవచ్చు. ఇంకా బరువు తగ్గొచ్చు. నువ్వుల్లో మాంసకృత్తులు, ఆమినోయాసిడ్లు నువ్వుల్లో సమృద్ధిగా ఉన్నాయి. మెగ్నీషియం శాతమూ ఎక్కువే. నువ్వులతో తయారైన నూనెను వాడటం వల్ల అధిక రక్తపోటు, రక్తంలో చక్కెరస్ధాయిలూ అదుపులో ఉంటాయి.
ముఖ్యంగా నల్ల నువ్వుల్లో ఐరన్ ఎక్కువగా ఉండటం ద్వారా రక్తహీనతను దూరం చేసుకోవచ్చు. పీచు, జింక్, కాల్షియం సమృద్ధిగా ఉందడం వల్ల రక్తనాళాలు, ఎముకలు, కీళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. నువ్వులు ఉబ్బసాన్ని తగ్గించడంలోనూ ఉపయోగపడతాయి.
ఇంకా సెసమాల్ అనే యాంటీ యాక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పదార్ధం ఉంటుంది. అది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వాటిలో ఉండే మోనోశాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు చెడు కొలస్ట్రాల్‌ని తగ్గించి, మంచి కొలస్ట్రాల్ పెరిగేలా చేస్తాయి. నువ్వుల్లో ఉండే పీచు జీర్ణక్రియ పనితీరుని మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.