Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

క్యాలీఫ్లవర్ జ్యూస్ రోజుకో గ్లాసుడు తాగితే..?

Updated: గురువారం, 19 సెప్టెంబరు 2019 (16:01 IST)
క్యాలీఫ్లవర్‌ని చాలా మంది ఇష్టపడరు. ఇది రుచికరంగా ఉండకపోయినా చాలా పోషక విలువలను కలిగి ఉంటుంది. దీన్ని తినడానికి ఇష్టపడని వారు నచ్చే రీతిలో కూరను తయారు చేసుకుని తినవచ్చు. క్యాలీఫ్లవర్‌ని మసాలా దట్టించి చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది. తాజా క్యాలీఫ్లవర్‌ రసాన్ని రోజూ ఒక గ్లాసు చొప్పున మూడు మాసాల పాటు త్రాగితే కడుపులోని పుండ్లు తగ్గిపోతాయి, దంతాలు చిగుళ్ల నుండి రక్తస్రావం తగ్గిపోతుంది. 
 
క్యాలీఫ్లవర్‌ని తీసుకోవడం వల్ల లంగ్‌, బ్రెస్ట్‌, ఒవేరియన్‌, బ్లాడర్‌ క్యాన్సర్‌ వంటి పలు రకాల క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదం ఉండదని పరిశోధకులు చెబుతున్నారు. క్యాలీఫ్లవర్‌ ఆకుల రసం రోజూ ఒక కప్పు తాగితే రేచీకటి, చర్మం పొడిపొడిగా ఉండటం, జుట్టు త్వరగా తెల్లబడటం, జలుబు వంటివి రావు. గర్భిణి స్త్రీలు ఈ రసం త్రాగితే పిండం ఆరోగ్యంగా పెరుగుతుంది. 
 
కాలేయం పనితీరును కూడా ఇది క్రమబద్ధం చేస్తుంది. క్యాలీఫ్లవర్‌లో ఉండే గ్లూకోసినోలేట్స్‌, థయోసయనేట్స్‌ లివర్‌ పనితీరును మెరుగుపరచడమే కాకుండా క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇందులో విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ నుండి రక్షణనిస్తుంది.

అన్నీ చూడండి

కాక్రోచ్ జనతా పార్టీ నేతల విడుద - ఢిల్లీలో భారీ భద్రత -30 వేల పోలీసుల మొహరింపు

జువెనైల్‌ జస్టిస్ చట్టానికి పదేళ్లు - ముందస్తు నివారణే మేలు : చందన మరిపల్లి

వీఐపీలకు షాకిచ్చిన తితిదే... సిఫార్సు లేఖలు బంద్

అమెరికాలో వైకాపా చీఫ్ జగన్‌ సన్నిహితుడుకి 50 నెలల జైలుశిక్ష

October 11, 2026: అక్టోబర్ 11నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణ సూచన

అన్నీ చూడండి

Rajeev Kanakala: స్కూల్ లోనే పిల్లల భవిష్యత్ ఆధారపడుతుంది : రాజీవ్ కనకాల, వితికా షేరు

Gallery 5 NXTinAI: గ్యాలరీ5 NXTinAI: AI వెండితెరపైకి అడుగుపెడుతోంది

Catherine Tresa : కరికాల చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ థ్రెసా అలెగ్జాండర్

Vijay Deverakonda Interview: మన ప్రజల ధైన్యం అమెరికా స్వాతంత్య్ర పోరాటానికి స్ఫూర్తి : విజయ్ దేవరకొండ

Nani Bloody Romeo look :బ్లడీ రోమియో లో చెఫ్‌.. గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న నాని

తర్వాతి కథనం
Show comments