వాటర్ థెరపీ అంటే ఏంటి?
రోజుకి కనీసం 10 నుంచి 15 గ్లాసులు నీళ్లు తాగాలి. నీటికి రక్తాన్ని శుద్ధి చేసే గుణం వుంటుంది. రక్తంలోని విసర్జకాలు నీటి ద్వారా శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి. దాంతో చర్మం జీవాన్ని సంతరించుకుని, వెలుగులు విరజిమ్ముతుంది. కాబట్టి దాహం వేసినా, వేయకపోయినా నీరు తాగుతూనే వుండాలి.
నీళ్లతో లాభాలు: నీటి వల్ల పేగులు శుభ్రపడి, మలబద్ధకం సమస్య తొలుగుతుంది. తీసుకున్న ఆహారంలోని పోషకాలు సోషించుకోబడతాయి. దాంతో చర్మానికి సరిపడా పోషకాలు అంది చర్మం ఆరోగ్యంగా వుంటుంది.
పరగడుపునే నీళ్లు తాగితే:
ఉదయం నిద్ర లేచిన వెంటనే కడుపు నిండా నీరు తాగడం వల్ల కొత్త కండర కణాలు, రక్త కణాలు తయారవుతాయి. అలాగే లింఫ్ వ్యవస్థ బలపడి, ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి సమకూరుతుంది. ఇవన్నీ పరోక్షంగా చర్మాన్ని ఆరోగ్యంగా వుంచుతాయి.