గురువారం, 28 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్ కుమార్
Last Updated : గురువారం, 19 సెప్టెంబరు 2019 (15:32 IST)

జామపండును తింటే థైరాయిడ్ మటాష్ (video)

మనం రోజూ తీసుకునే పండ్లలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. వాటిలో కొన్ని ఎన్నో రకాల రోగాలను నయం చేయగలవు. వాటిలో జామ పండు కూడా ఒకటి. జామపండును ప్రతిరోజు తీసుకోవటం వలన థైరాయిడ్‌ నుండి విముక్తి పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జామపండులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుందని అంటున్నారు నిపుణులు.
 
అందుకే విటమిన్-సి లోపించడం వలన వచ్చే వ్యాధులను జామకాయ తినడం ద్వారా దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు, అంతే కాకుండా థైరాయిడ్ సంబంధిత వ్యాధులను జామకాయ దరిచేరనివ్వదు అని అంటున్నారు.
 
జామపండులో చాలా శక్తివంతమైన యాంటీ-ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అందుకే జామ అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. జామపండులో విటమిన్-సితో పాటు విటమిన్-ఎ చాలా ఎక్కువ. జామను రోజుకొకటి తీసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే జామపండులో పీచు పదార్థాలు ఎక్కువ, తద్వారా బరువును నియంత్రించుకోవచ్చు.
 
జామపండులోని విటమిన్-బి6, విటమిన్ బి3 వంటి పోషకాల వలన మెదడు చురుగ్గా ఉంటుంది. ఈ విటమిన్స్ వలన మెదడులోని న్యూరాన్లు సమర్థవంతంగా పని చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.