1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chj
Last Modified: బుధవారం, 7 డిశెంబరు 2016 (16:06 IST)

రిలాక్స్... రిలాక్స్... ఒత్తిడి వద్దు... ఆరోగ్యానికి ముప్పు...

జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతుంటాయి. కొందరు వాటిని ఎదుర్కొని నిలబడతారు. మరికొందరు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంటారు. ఐతే ఈ ఒత్తిడితో ఆరోగ్యానికి కలిగే నష్టాలేంటో తెలుసుకోవాలి. మానసిక ఒత్తిడి శరీర వ్యవస్థను బాగా దెబ్బతీస్తుంది. ఒత్తిళ్లు తీవ్రమైనప్

జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతుంటాయి. కొందరు వాటిని ఎదుర్కొని నిలబడతారు. మరికొందరు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంటారు. ఐతే ఈ ఒత్తిడితో ఆరోగ్యానికి కలిగే నష్టాలేంటో తెలుసుకోవాలి. మానసిక ఒత్తిడి శరీర వ్యవస్థను బాగా దెబ్బతీస్తుంది. ఒత్తిళ్లు తీవ్రమైనప్పుడు నాడీ వ్యవస్థ కొన్ని రసాయనాలను విడుదల చేస్తుంది. 
 
మనసు ఒత్తిడికి గురువుతోందీ అంటే, ఏదో ఘర్షణ ఉందని, శరీరానికి అదనపు శక్తి అవసరమవుతుందని భావించి శరీరం హార్మోన్లను విడుదల చేస్తుంది. ఆ వెనువెంటనే గుండె వేగం, రక్తపోటు పెరుగుతాయి. అదనపు శక్తి కోసం గ్లూకోజ్ సాధారణ పరిమాణం కన్నా మించి విడుదల అవుతుంది. 
 
ఇది శరీర శ్రమకు సంబంధించినది కాకపోవడం వల్ల అదనంగా విడుదల అయిన గ్లూకోజ్ శరీరంలోనే నిలిచిపోతుంది. అంతిమంగా ఇది మధుమేహానికి దారితీస్తుంది. వీటన్నింటికీ విరుగుడు శరీర శ్రమ, యోగా ప్రాణాయామాల. వ్యాయామాలు శరీర వ్యవస్థను బలోపేతం చేయడమే కాదు. మానసిక ఒత్తిళ్లను తట్టుకునే శక్తిని కూడా పెంచుతాయి.