Webdunia - Bharat's app for daily news and videos

Install App

జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్‌కు దూరంగా వుంటే.. డబుల్ చిన్‌కు చెక్

Written By సందీప్
Updated: మంగళవారం, 25 జూన్ 2019 (18:18 IST)
ముఖ వర్చస్సు ఎంత ఉన్నా డబుల్‌ చిన్ ఉంటే ఆ వదనం అందాన్ని కోల్పోతుంది. ఈ సమస్య ఉన్నవారు చాలా మంది ఆందోళనకు గురౌతుంటారు. కొందరికి డబుల్‌ చిన్‌ వయసు వల్ల వస్తే, మరికొందరికి జన్యుపరంగా ఇది సంక్రమిస్తుంది. దీనికి శరీర బరువు కూడా ఒక కారణం. వ్యాయామాలు చేయకపోవడం, చర్మం వదులుకావడం, జన్యుపరమైన అంశాలు ముఖ్య కారణాలు. 
 
శరీర భాగాలకు లాగానే ఫేషియల్‌ కండరాలకు కూడా నిత్యం వ్యాయామం అవసరం. ముఖ కండరాలకు సంబంధించిన వ్యాయామాలు చేయడం వల్ల ముఖంపై చర్మం బిగుతుగా మారడమే కాకుండా టోనింగ్‌ కూడా బాగా అవుతుంది. ఇలాంటి వారు పౌష్టిక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్‌కి దూరంగా ఉండాలి. తరచూ స్కిన్‌ కేర్‌ పద్ధతులను అనుసరించినట్లయితే చర్మం ఆరోగ్యకరంగా, మృదువుగా ఉండడంతో పాటు గడ్డం కింద కొవ్వు వల్ల ఏర్పడే ముడతలు కనపడకుండా ఉంటాయి. 
 
డబుల్‌ చిన్‌ని చాలామంది అందానికి సంబంధించిన అంశంగానే చూస్తారు కానీ వైద్యపరంగా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చని ఆలోచించరు. కానీ డబుల్‌ చిన్‌ సమస్యను అధిగమించడానికి సురక్షితమైన రకరకాల వైద్య పద్ధతులు ఉన్నాయి. గడ్డం కింద భాగంలో చేరిన కొవ్వును తొలగించేందుకు పలు నాన్‌ ఇన్వేసివ్‌ చికిత్సలను వైద్య నిపుణులు చేస్తున్నారు. 
 
వీటిల్లో డైట్‌, వ్యాయామాలు వంటి సింపుల్‌ టెక్నిక్స్‌ సైతం ఉన్నాయి. డబుల్‌ చిన్‌ పరిష్కారానికి క్రియోలిపోలసిస్‌ చేస్తారు. ఇది పాపులర్‌ ప్రొసీజర్‌. లేజర్‌ రిడక్షన్‌ ప్రక్రియ ద్వారా కూడా దీన్ని తగ్గించుకోవచ్చు.

అన్నీ చూడండి

ఆ రోజు వైసిపి ప్రభుత్వం ఆ పని చేయకుంటే...? Xలో ట్రెండ్

HANUMAN: హైడ్రాలిక్ క్రేన్‌లు తవ్వినా హనుమంతుడు కదల్లేదు.. సీక్రెట్ ఏంటి (video)

అరక్కోణం-రేణిగుంట రైల్వే లైన్ ప్రాజెక్ట్... హర్షం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్

సెప్టెంబర్ 10, 2026 తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది..?

దేశంలోనే తొలిసారిగా శ్రీవారి భక్తులకు బీమా సౌకర్యం : బీఆర్ చైర్మన్

అన్నీ చూడండి

Udayabhanu: పంచనామాకు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా : ఉదయభాను ఎమోషనల్

అదే హుందాతనం, శైలితో గతాన్ని తలచుకుంటూ జనవరి 12 విడుదల

Anupama Parameswaran,: క్రేజీ కల్యాణం నుంచి 'కాకా ధూమ్ ధమాకా సాంగ్ ప్రోమో

Haiku : ఏగన్, శ్రీదేవి.. రొమాన్స్, కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న హైకూ టీజర్

Rashmika: విజయ్ దేవరకొండ నట విశ్వరూపం చూపించిన రణబాలి టీజర్

తర్వాతి కథనం
Show comments