ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 21 సెప్టెంబరు 2016 (19:00 IST)

గురక తగ్గాలంటే.. పిప్పర్‌మెంట్.. యాలకుల చూర్ణం.. ట్రై చేయండి గురూ...

గురక పెట్టే అలవాటుందా? నోరు మూసేసుకుని గురకపెడుతున్నారా? తెరుచుకుని గురకపెడుతున్నారా? వెల్లకిలా పడుకుని గురకపెడుతున్నారా? లేకుంటే ఏ రకంగా నిద్రపోయినా గురక వస్తుంటే దాన్ని తీవ్రమైన సమస్యగా గుర్తించాలని

గురక పెట్టే అలవాటుందా? నోరు మూసేసుకుని గురకపెడుతున్నారా? తెరుచుకుని గురకపెడుతున్నారా? వెల్లకిలా పడుకుని గురకపెడుతున్నారా? లేకుంటే ఏ రకంగా నిద్రపోయినా గురక వస్తుంటే దాన్ని తీవ్రమైన సమస్యగా గుర్తించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ప్రశాంతమైన నిద్ర ఆయువు పెంచితే గురకతో కూడిన నిద్ర ఆయువును హరిస్తుంది. అందుకే.. గురకను తేలిగ్గా తీసిపారేయకుండా వైద్యులను సంప్రదించాలని వారు చెప్తున్నారు.
 
అందుకే గురక తగ్గాలంటే ఈ టిప్స్ పాటించండి. ఈ చిట్కాలు పాటించినా గురక తగ్గకపోతే.. తప్పకుండా వైద్యులను సంప్రిదించండి. అర టీ స్పూన్‌ తేనె, అర టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌ కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగితే మంచి ఫలితం కనపడుతుంది. ఒక గ్లాసు నీటిలో ఒకటి లేదా రెండు పిప్పర్‌మెంట్ చుక్కలు వేసి రాత్రి నిద్రపోయే ముందు నోటిలో పోసుకుని బాగా పుక్కిలించాలి. అలాగే పిప్పర్‌మెంట్ ఆయిల్‌ను చేతివేళ్లకు రాసుకుని వాసన చూస్తుంటే గురక తగ్గిపోతుంది. 
 
ఇంకా ఓ గ్లాసుడు వేడి నీటిలో అర టీ స్పూన్ యాలకుల చూర్ణం కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి నిద్రిస్తే మంచి ఫలితం ఉంటుంది. రాత్రి పడుకొనే ముందు మరిగే నీటిలో 4, 5 చుక్కలు యూకలిప్టస్‌ ఆయిల్‌ వేసి ఆవిరి పట్టినా గురక నుంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.