బుధవారం, 1 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : గురువారం, 20 మే 2021 (20:20 IST)

మటన్, చికెన్ తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఇది తీసుకోరాదు (video)

కరోనా కాలంలో ఎక్కువగా మాంసం తినే వారి సంఖ్య పెరుగుతోంది. చికెన్, మటన్ తినేవారు దాన్ని తిన్న తర్వాత కొన్ని పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదంటున్నారు వైద్య నిపుణులు.
మాంసం తిన్న తర్వాత ఏ పదార్థాలు తినకూడదో చాలా కొద్ది మందికి తెలుసు. ఆ విషయాలు ఏమిటో తెలుసుకుందాం.
 
తేనె- మటన్ రెండూ కలిపి తినడం మన శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుందని అందరికీ తెలుసు. ఇది కాకుండా, తేనె కూడా వెచ్చగా ఉంటుంది. కాబట్టి మాంసం తర్వాత ఎప్పుడూ ఈ తేనెను తినకూడదు. ఇది శరీరానికి చాలా హాని కలిగిస్తుంది.
 
అలాగే పాలు- మటన్ లేదా చికెన్ తిన్న తర్వాత లేదా ముందు పాలు తాగకూడదు. ఇది అనారోగ్య సమస్యలు తలెత్తేట్లు చేస్తుంది. 
 
టీ- చాలా మంది ఆహారం తీసుకున్న తర్వాత టీ తాగడం చాలా ఇష్టం. కానీ ఏ రకమైన ఆహారం, శాఖాహారం లేదా మాంసాహారం తిన్న వెంటనే టీ తాగవద్దు. ఎందుకంటే ఇది అజీర్ణం కలిగించి కడుపుకి చికాకు కలిగిస్తుంది.