శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 21 జులై 2016 (15:44 IST)

వీకెండ్లలో గ్రిల్డ్ చికెన్, తండూరి చికెన్‌లను బాగా లాగిస్తున్నారా?

వీకెండ్‌లొస్తే బిర్యానీలు, గ్రిల్డ్ చికెన్, తండూరి చికెన్‌లను లాగించేస్తున్నారా? వీటిని కాల్చడంతో నూనెక్కువ ఉండదని.. అందుచేత గ్రిల్డ్ చికెన్‌ను తీసుకుంటే ఆరోగ్య సమస్యలుండవని అనుకుంటున్నారా? అయితే మీరు

వీకెండ్‌లొస్తే బిర్యానీలు, గ్రిల్డ్ చికెన్, తండూరి చికెన్‌లను లాగించేస్తున్నారా? వీటిని కాల్చడంతో నూనెక్కువ ఉండదని.. అందుచేత గ్రిల్డ్ చికెన్‌ను తీసుకుంటే ఆరోగ్య సమస్యలుండవని అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. మంటలు, నిప్పులపై కాల్చుకుని లేదా పాన్‌లో వేయించుకుని తినే ఆహారాల ద్వారా పెద్ద పేగుకు, కిడ్నీకి క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
రెడ్ మీట్‌లో కొవ్వు అధికంగా ఉంటుందని దాన్ని బొగ్గు  లేదా మంటల్లో కాల్చితే అది కేన్సర్ కారక మిశ్రమాలతో కలుస్తుందని.. ఇలాంటి మాంసం తినడం ద్వారా పెద్ద పేగు, కిడ్నీ తదితర భాగాలు కేన్సర్‌కు గురయ్యే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
గ్రిల్లింగ్ ద్వారా కొవ్వు గల పదార్థాల్లో క్యాన్సర్ కారకులు కలుస్తాయని, చికెన్ మారినేటింగ్ ద్వారా కలిపే సాస్ ఇతరత్రా పదార్థాలు నిప్పు పడే కొద్దీ నెగటివ్‌గా తయారవుతాయని, ఇంకా మారినేటింగ్ చికెన్‌లో హై-సోడియం ఉంటుందని ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదని వారు సూచిస్తున్నారు.